పాలమూరు ద్రోహి కేసీఆర్.. కృష్ణా జలాలు ఆంధ్రా తరలించుకు పోతున్నారంటే దానికి కారణం కేసీఆర్ దుర్మార్గం వల్లనేని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. పదేళ్లలో ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నించారు. పదేళ్లలో పాలమూరును ఎందుకు పూర్తి చేయలేదు.. బీమా,కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..? .ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది..? ఎస్ ఎల్ బీసీ పదేళ్ల పాటు పడాగ పెట్టడం తో కుప్పకూలిపోయింది.. ఈ పాపం కేసీఆర్ ది కాదా..? అని ప్రశ్నించారు. వనపర్తిలో పలు కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు.
ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి కేసీఆర్ చూడలేదా..? జగన్ను ప్రగతి భనవ్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా..?.
మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపీ గా గెలిపించుకుంటే కేసీఆర్ ఏం చేశావని ప్రశ్నించారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ కు అన్యాయం జరిగేలా సంతకం పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. ఆ సంతకమే తెలంగాణకు యమపాశంగా మారిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యేడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బీఆర్ఎస్ సన్నాసులు అంటున్నారు.. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు.. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారని మండిపడ్డారు. మా పాలమూరు బిడ్డలకు పరిపాలించే శక్తి లేదా అని ప్రశ్నించారు. నానా కష్టాలు పడి వరంగల్ కు ఎయిర్ పోర్టు తీసుకువస్తే కిషన్ రెడ్డి నేనే తీసుకువచ్చానని చెపుతున్నాడని… కిషన్ రెడ్డి కడుపు నిండా అసూయ, కుళ్ళు పెట్టుకుని కాళ్లలో కట్టెలు పెడుతున్నాడని విమర్శించారు. కిషన్ రెడ్డి కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నాడు.. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు మెట్రో తీసుకువెళ్లింది. కేంద్ర మంత్రి శోభా బెంగళూరు కి మెట్రో తీసుకెళ్లింది.. సొంత రాష్ట్రం తెలంగాణ కు కిషన్ రెడ్డి ఎందుకు మెట్రో తీసుకురాడం లేదుని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎంత కాలం భయపెడతవు కిషన్ రెడ్డి.. చావు మళ్లీ మళ్లీ రాదు.. చావుకు మేం భయపడమన్నారు.
రేవంత్ రెడ్డి ప్రతి సభలో కేసీఆర్ తో పాటు.. కిషన్ రెడ్డిని కూడా సమాన స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వనపర్తిలోనూ అదే కొనసాగించారు.