తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన కౌంటింగ్ సోమవారం ప్రారంభమవుతుంది. కానీ ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కష్టం. రెండు నుంచి మూడు రోజుల వరకూ ఎన్నికల పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. బ్యాలెట్లను ముందుగా కట్టలుగా కట్టి తర్వాత లెక్కింపు చేయాలి. ఒక్క ఓటు చాలా పరిశీలన చేయాల్సి ఉంటుంది. చెల్లని ఓట్లు అధికంగా ఉంటాయి. ఎవరికైనా మొదటి కౌంటింగ్ లో యాభై శాతం ఓట్లు వస్తే పర్వాలేదు..రాకపోతే మళ్లీ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ.. అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తూ పోవాలి. ఇదో సుదీర్ఘ ప్రక్రియ. అందరి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని కాకుండా.. యాభై శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వారినే విజేతగా ప్రకటిస్తారు.
ఏపీలో రెండు గ్రాడ్యూయేట్స్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. రెండు గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసింది. ఒక టీచర్ స్థానంలో మాత్రం పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇచ్చింది. మొత్తంగా మూడు స్థానాల్లో గెలుపు కోసం కూటమి అభ్యర్థులు ప్రయత్నించారు. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా పోటీ చేసి గెలిచేసే వైసీపీ అధికారం పోయే సరికి పోటీ చేసేందుకు కూడా భయపడింది. అంటే అధికారంలో ఉంటే ఎలా గెలిచేదో సులువుగా ఆర్థం చేసుకోవచ్చు. వైసీపీ తాను పోటీ చేయకపోయినా పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతిచ్చింది.
తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు బీఆర్ఎస్ పూర్తిగా ఎన్నికల బరి నుంచి వైదొలిగింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరాటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ ఎమ్మెల్సీ విషయంలో వెనక్కి తగ్గింది.కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలకు మద్దతు ఇచ్చింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా మాత్రం పోటీ చేసింది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.