ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉన్న ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. గతంలో అయితే పీడీఎఫ్ లాంటి కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్వతంత్ర అభ్యర్థులు గెలిచేవారు. కానీ వైసీపీ చేసిన నిర్వాకంతో విద్యావంతులు అంతా టీడీపీ వైపు పోలరైజ్ అయ్యారు. చదువుకున్న వాళ్లు విడిపోతే మూర్ఖులే రాజ్యం చేస్తారని తెలుసుకుని ఏకతాటిపైకి వచ్చారు. దాని ఫలితమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.
వైసీపీ ఓటర్లు ఎవరో సజ్జలకు బాగా తెలుసు !
పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలవడానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేనన్ని దొంగ ఓట్లను నమోదు చేసింది. డిగ్రీలు చేయని వాళ్లను కూడా ఓటర్లను చేసింది. అయినా భారీ తేడాతో ఓడిపోయారంటే వారిపై చదువుకున్న వారిలో ఉన్న వ్యతిరేకత స్పష్టమయింది. ఇప్పుడు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో చదువుకున్న వారు ఇచ్చిన తీర్పుతో మరోసారి తేలిపోయింది. మా ఓటర్లు చదువుకున్నవారు కాదని.. నిర్లక్ష్యరాస్యులని గతంలోనే సజ్జల చెప్పుకున్నారు. కానీ వారినీ మభ్యపెట్టలేరని రాను రాను జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఓటర్లను మూర్ఖులను చేసి ఎంత కాలం రాజకీయం చేస్తారు ?
వైసీపీ మీడియా, సోషల్ మీడియా కళ్ల ముందు కనిపించే నిజాలను కూడా అబద్దాలుగా ప్రచారం చేస్తుంది. ఎంతగా అంటే జగన్ రెడ్డి తనకు పత్రిక, టీవీ లేవని ఏ మాత్రం మొహమాటపడకుండా చెబుతారు. ప్రజలకు అందరికీ తెలిసిన దాన్ని కూడా అంత నిస్సిగ్గుగా అబద్దం చెప్పగలుగుతారంటే.. తమను నమ్మేవారని ఎంత మూర్ఖులుగా చేయాలని వారు అనుకుంటారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ సాక్షి మీడియాలో కానీ.. టీవీలో కానీ.. సోషల్ మీడియాలో కానీ నిజాలు చెప్పరు. దానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే సాక్ష్యం. అయితే అధికారంలో ఉన్నప్పుడు వారి ఓటర్లు మూర్ఖంగా నమ్మారు కానీ.. ఇప్పుడు ఇక నమ్మే అవకాశాల్లేవు.
నమ్మేవాళ్లూ తగ్గిపోతున్నారు – మూర్ఖులుగా మిగిలేది జగన్ అండ్ కోనే!
తమ ఓటర్లు మూర్ఖులని.. తాము ఏం చెబితే అది చేస్తారని వైసీపీ నేతలు నమ్ముతారు. ఓ సారి నమ్మితే అది అబద్దమని తేలితే రెండో సారి నమ్మడానికి సంకోచిస్తారు. రెండో సారి కూడా అదే అబద్దం చెబితే మూడో సారి నమ్మరు. వైసీపీ నేతలు ఇలా పది సార్లు నమ్మించారు. ఇక వైసీపీ క్యాడర్ కూడా తమ నేతల్ని నమ్మి మూర్ఖులవడానికి సిద్ధంగా లేరు. అలాంటి వారి సంఖ్య వేగంగా పడిపోతుంది. అంటే.. వైసీపీ ఓటర్లు కూడా చైతన్యవంతులవుతున్నారు. ఇది అసలైన మార్పు.