రాజేంద్ర ప్రసాద్ ఓ తరాన్ని అలరించిన నటుడు. కామెడీ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పంధాని సృష్టించుకొని మాజీ ప్రధాని పీవీ నరసింహరావు లాంటి పెద్దల మన్ననలు పొందిన నటుడు. నిజానికి ఈపాటికే దేశం ఆయన్ని గుర్తుంచాల్సింది. ఆయన సినిమాల్లో హీరోయిన్ గా నటించి పక్కన కామెడీ పాత్రలు చేసే నటులకి సైతం పద్మ పురస్కారాలు వచ్చాయి కానీ ఇప్పటికీ ఆయన్ని కేంద్ర ప్రభుత్వాలు గుర్తుంచలేదు.
ఇదే విషయం ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. అవార్డులు రాజకీయంతో ముడిపడ్డాయని, ఇప్పుడు సిఫార్సులు చేసుకునే ఓపిక తనకిలేదని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఇదే సమయంలో ఈనాడు అధినేత దివంగత రామోజీరావు ఇచ్చిన సలహాని గుర్తు చేసుకున్నారు. ఓసారి రామోజీ పద్మశ్రీ గురించి ఆయన్ని అడిగారట. ఇంకా రాలేదని చెప్పారు రాజేంద్రప్రసాద్. దయచేసి నువ్వు ఎప్పుడూ పద్మశ్రీకి ప్రయత్నించకు. ప్రేక్షకులు గుండెల్లో నీ స్థాయి దానికంటే పెద్దది’ అని చెప్పారట రామోజీ. ఆయన చెప్పిన మాట తనకు గొప్ప అవార్డ్ ని ముక్తాయించారు రాజేంద్ర ప్రసాద్.