జగన్ మోహన్ రెడ్డి తాను చేసేదే రాజకీయం అనుకుంటారు. అందుకే ప్రజాస్వామ్యంలో గెలుపు ఎలా సాధించాలి.. ప్రజల మనసుల్ని ఎలా గెల్చుకోవాలి..అనే విషయాలపై ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ఆయన వ్యక్తిత్వం ప్రకారం.. తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. ఎవరో చెప్పడం ఏమిటి..నేను చేసేదే రాజకీయం మిగిలిన వారిదంతా అరాజకీయం అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆయనకు ఈ మాట చెప్పడానికి కూడా రాదు. సజ్జల రామకృష్ణారెడ్డి రాసివ్వాల్సిందే. బుధవారం ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు విన్న ఎవరికైనా ఇలా ఎలా రాజకీయాల్లో కొనసాగగలడని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడే లీడర్‌ను ప్రజాస్వామ్యంలో చూడగలమా ?
చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్లుగా జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ఏడుస్తున్నారు. ఆయన ఏడుపంతా దాని కోసమే. హోదా కావాలి అని. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ప్రజలు ఇవ్వలేదు.. ప్రభుత్వం ఎందుకిస్తుంది అని. ఇచ్చే అవకాశం స్పీకర్ కు మాత్రమే ఉంది. కానీ ఆయన ప్రజలు ఇవ్వని దాన్ని తాను ఇవ్వలేనని చెప్పి తేల్చేశారు. అలాంటప్పుడు ఏ లీడర్ అయినా ఏం చేస్తారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల తరపున తాను పోరాడతానని రంగంలోకి దిగుతారు.కానీ జగన్ మాత్రం.. ప్యాలెస్ నుంచే బురద చల్లుతా..మీరు కడుక్కోండని సవాల్ చేస్తున్నారు.
ఆఫ్టరాల్ ఎమ్మెల్యే.. చంద్రబాబు, పవన్‌లపై ఆ మాటలేంది !?
జగన్ మోహన్ రెడ్డి హోదా ఇప్పుడు ఏంటి.. ?. ఆయన పార్టీకి అధ్యక్షుడు. అది ఆయన పార్టీకి పరిమితం. వైసీపీ ఎమ్మెల్యేలకు నాయకుడు. అది కూడా పార్టీకే పరిమితం. రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం అయిన ఆయన హోదా మాత్రం కేవలం ఎమ్మెల్యే. ఆయన ఏమంటారు.. చంద్రబాబుకు తాను గతంలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చానంటారు. ఆయన ఎవరు ఇవ్వడానికి పది శాతం సీట్లు ఉంటే గుర్తింపు వస్తుంది. అది సీఎం ఇచ్చేది కాదు. పది మంది ఎమ్మెల్యేలను లాగేస్తానంటే ఆయన వద్దన్నాడట. చేతకాలేదని చెప్పుకోలేని తనం. నలుగుర్ని లాక్కున్నది జనం మరచిపోతారా?. డిప్యూటీ సీఎంను పట్టుకుని కార్పొరేటర్ …ఎమ్మెల్యే అంటూ వెటకారాలు ఆడితే.. ఎవరి పరువు పోయేది.?. ప్రజలు ఎంత ఘోరంగా ఓడించినా కనీసం తెలుసుకోలేని జగన్ ని చూసే అందరూ జాలి పడతారు.
అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకోలేదు..ఇప్పుడూ తెలుసుకోలేరా ?
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కిన స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడూ కిందకు దిగలేదు. ప్రమాద ఘంటికలు వచ్చినా థర్టీ ఇయర్స్ నేనే సీఎం అని చెప్పుకున్నారు. చివరికి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ కే ప్రమాదం ఏర్పడింది. అయినా అయినా ఆయన ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ప్రజల్ని గౌరవించలేకపోతున్నారు. ప్రజల్ని గౌరవిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్ పొడిగింపు ఉంటుంది.లేకపోతే.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ.. ప్రజలకు లాఫింగ్ గ్యాస్ అందిస్తూ ఉండటమే.