ఈద్ సందర్భంగా కేవలం తెలుగు వెర్షన్ టీజర్ నే కాదు… మలయాళ వెర్షన్ టీజర్ ను కూడా విడుదల చేశారు “జనతా గ్యారేజ్’’ రూపకర్తలు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సినిమాల్లో కెళ్లా యమ క్రేజీనెస్ ను సంపాదించుకుంది ‘జనతా గ్యారేజ్’. వరస హిట్ల మీద ఉన్న కొరటాల శివ.. తమ హీరోని కొత్త హైట్స్ కు తీసుకెళతాడని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. వీరి సంగతిలా ఉంటే.. జనతా గ్యారేజ్ మరో స్టార్ హీరో అభిమానులను కూడా ఉత్సాహపరుస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు.. మోహన్ లాల్. ఈ మలయాళ అగ్ర నటుడు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడని వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విషయంలో ఆది నుంచి ఇదొక ఆసక్తికరమైన విషయంగా మారింది.
ఇక మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తుండటంతో.. ఈ సినిమాకు మలయాళంలో కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. ఇప్పటికే విడుదల అయిన మలయాళీ టీజర్ కు కూడా మంచి ఆదరణే లభిస్తోంది. ఆసపక్తికరమైన విషయం ఏమిటంటే.. మలయాళ టీజర్ లో ప్రధానంగా మోహన్ లాల్ వాయిస్ వినిపించడం! తెలుగు వెర్షన్ టీజర్ లో ఎక్కడా మోహన్ లాల్ వాయిస్ వినపడదు. ఎన్టీఆర్ చెప్పై డైలాగులతోనే నిండి ఉంది టీజర్. ఒకసారి మాత్రం మోహన్ లాల్ ను చూపుతారు. అయితే మలయాళం టీజర్ లో మోహన్ లాల్ వాయిస్ ప్రధానంగా వినిపిస్తుంది.
ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులకు దగ్గర చేయాలన్నా… మోహన్ లాల్ అభిమానులను సంతృప్తి పరచాలన్నా.. ఇదొక చక్కటి ఎత్తుగడే! తెలుగులో పరాభాష క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందే నటిస్తున్నారు కానీ.. అవతల భాషలో ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ స్థాయి నటుడు ఈ మధ్య ఎప్పుడూ నటించలేదు. ఇలాంటి నేపథ్యంలో జనతాగ్యారేజ్ దర్శకుడు.. ఆ స్టార్ హీరో ఇమేజ్ ను టీజర్ దగ్గర నుంచే బ్యాలెన్స్ చేశాడు.