కొన్ని సినిమాలు కెరీర్ ని ఒక్కసారి వెనక్కి లాగేస్తాయి. అఖిల్ ‘ఏజెంట్’ కూడా అలాంటి సినిమానే. పాన్ ఇండియా చుట్టేయాలనే తనపతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. నిర్మాత అనిల్ సుంకర కూడా ప్రాజెక్ట్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఫారిన్ లోకేషన్స్ లో షూట్ చేశారు. కానీ సినిమా దారుణంగా వచ్చింది.
ఓపెనింగ్ రోజే క్లోజింగ్ డే అయినంత డిజాస్టర్. ఈ సినిమా మేకింగ్ లో ఎలాంటి లోపాలు జరిగాయంటే.. ఓటీటీలోకి రావడానికి కూడా రెండేళ్ళు ఎదురుచూడాల్సింది వచ్చింది. ఎట్టకేలకు మార్చి14న సోనీలీవ్ లో ప్రసారం కాబోతోంది. తమ హీరో సినిమా కనీసం ఓటీటీలోకి కూడా రావడం లేదని బాధపడుతున్న అఖిల్ ఫ్యాన్స్ కి ఇదొక ఊరట.
అయితే ఈ సినిమా ప్రభావం సురేందర్ రెడ్డిపై బలంగా పడింది. ఇప్పటికీ ఆయన కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఆయన చాలా ప్రయత్నాల్లో వున్నారు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సింది. ఆఫీస్ తీసి పూజ కూడా చేశారు. కానీ సినిమాకి బ్రేకులు పడ్డాయి. వెంకటేష్ తో ఓ సినిమా అనుకుంటున్నారు. అది కూడా ఇంకా ఖారారు కాలేదు. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకీ. ఆయన గనుక ఫాంలో వున్న డైరెక్టర్ వైపు మొగ్గు చూపితే సూరి ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.