వైఎస్ జగన్కు కర్ణాటకలో క్రేజ్ పెరుగుతోంది. అక్కడి నుంచి హిందూ మఠాలకు చెందిన వారు తాడేపల్లికి వచ్చి ఆయనను తమ మఠంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అంత దూరం నుంచి చార్జీలు పెట్టుకుని రావడం ఎందుకు లాస్..జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటాడు కదా.. అక్కడే కలిసి ఆహ్వానించవచ్చు కదా అనే డౌట్ మనకు వస్తే దానికి సమాధానం ఉండదు.కానీ వారు మాత్రం తాడేపల్లికి వచ్చి.. జగన్ను ఆహ్వానించారు. ఆయన వెళ్తారో లేదో తర్వాత విషయం కానీ హిందూ మఠానికి చెందిన వారు వచ్చి జగన్ ను ఆహ్వానించడం మాత్రం…వైసీపీ నేతలు ప్రముఖంగా ప్రచారం చేసుకోవాల్సిందే.
కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర అనే పీఠం ఉంది. ఆ పీఠంలో ఏప్రిల్ 30 న ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికే జగన్ ను ఆహ్వానించారు. వీరిని తీసుకు వచ్చింది వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయేమో కానీ.. ఇలా తాడేపల్లికి తీసుకు వచ్చారు. తిరుపతిలో లడ్డూ వివాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యమతస్డుడినని.. శ్రీవారిపై నమ్మకం ఉందని సంతకం చేయాల్సి వస్తుందని పర్యటన మానుకున్నారు.
రాజకీయాల కోసం ఆయన తరపున మాట్లాడేవారు జగన్ హిందూత్వం పాటిస్తారని చెబుతారు.కానీ ఆయన మాత్రం జెరూసలెంకు మాత్రమే వెళ్తారు. ఆయన కుటుంబం తిరుమలకు కూడా వెళ్లదు. ప్రసాదం ముట్టరు. కానీ ఇంటి దగ్గర సెట్టింగులు వేసుకుంటారు. కరుడుగట్టిన క్రిస్టియన్ జగన్ అని అందరికీ తెలుసు. అయినా ఓట్ల కోసం హిందూ వేషాలు వేస్తూంటారు. కొంత మంది స్వాములతో నమ్మించే ప్రయత్నాలు చేస్తూంటారు. ఆయన ఆస్థాన స్వామిజీ స్వరూపానంద కనిపించకుండా పోయారు. అందుకే కర్ణాటక నుంచి కావాల్సిన వాళ్లను పిలిపించుకుంటున్నట్లుగా ఉన్నారు.