హైదరాబాద్‌లో అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రారంభమయిది. అయితే చాలా గందరగోళం ఉంది. వీటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31 లోగా పూర్తి ఫీజు, ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ వర్తిస్తుంది.
అర్హత లేని ప్లాట్ల ఫీజు 90 శాతం రిఫండ్
LRS కు అర్హత లేని ప్లాట్ లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో 90 శాతం వరకు రిఫండ్ చేయనున్నారు. మిగతా 10 శాతం మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా మొత్తం ఫీజు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక లే అవుట్ లలో కనీసం 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితేనే మిగతా 90శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ కు అనుమతి లభిస్తుంది.
టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8లక్షలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చాయి. కానీ సరైన ప్రాసెస్ తెలియకపోవడం.. ప్రకటించిన ప్రాసెస్‌లో పనులు జరగకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో 1800599838 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నెంబర్ ప్రకటించినట్లుగా తెలియగానే వందల కాల్స్ వచ్చాయంటే.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కీలక విషయాలు ఇవీ
అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొచ్చారు. అయితే గతంలో కనీసం ఆ లేఅవుట్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితేనే ఎల్ఆర్ఎస్ కు అర్హులుగా భావిస్తారు. ఆ లేఅవుట్లలో మిగతా ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి కానుంది. పది శాతం కంటే తక్కువ ప్లాట్లు రిజిస్ట్రర్ అయిన లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ ఇవ్వరు. నిషేధిత స్థలాలు, చెరులు, ఇతర జలాశయాలకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ప్లాట్లు సైతం ఎల్ఆర్ఎస్ కింద రెగ్యూలరైజ్ చేసుకోవడం కుదరదు. చెరువులు, జలాశయాలకు 200 మీటర్ల లోపు ప్లాట్లు ఉంటే నీటి పారుదల, రెవెన్యూ శాఖ నుంచి పర్మిషన్ వస్తేనే రెగ్యులరైజ్ చేస్తారు.