హోమ్ లోన్ అనే ఆప్షన్ తీసుకోవడానికి చాలా మంది తమకు తాము చెప్పుకునే కారణాలలో ఒకటి .. ఆదాయపు పన్ను తగ్గింపు. హోంలోన్ వడ్డీతో పాటు అసలుకు కూడా మినహాయింపు ఉంటుందని ఎక్కువ మంది లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన మార్పుల వల్ల ఇక హోమ్ లోన్స్ కు.. టాక్స్ తగ్గింపునకు సంబంధం లేకుండా పోతోంది. అందుకే మిల్లేనియల్స్ ఇళ్ల కొనుగోలు విషయంలో ఎలా స్పందిస్తారన్నది మార్కెట్ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే.. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇన్ కంట్యాక్స్ రూ. పన్నెండు లక్షల వరకూ లేదు. అంటే నెలకు లక్ష సంపాదించే వారికి పన్ను ఉండవు. ఇప్పటి వరకూ అయితే.. అరవై వేలు సంపాదిచే వారికీ పన్ను ఉంది. చాలా మంది పన్ను తగ్గింపు కోసం హోమ్ లోన్ వడ్డీ, అసలు చూపించుకోవడానికి భారమైనాఇల్లు కొంటూంటారు. కొత్త విధానంలో పన్నెండు లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇస్తారు. ఎలాంటి సేవింగ్స్ చూపించాల్సిన అవసరం లేదు. అలాగే హోమ్ లోన్స్ తీసుకుని.. పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
అందుకే వచ్చే ఏడాది నుంచి హోమ్ లోన్స్ తీసుకునేవారిలో సంఖ్య ..ముఖ్యంగా పన్ను మినహాయిపు కోసం హోమ్ లోన్స్ అన్న ఆలోచన ఉన్నవారు తొందరపడే అవకాశం లేదు. ఇలాంటి వారు ఆలోచలు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లోన్లు కట్టే సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి అలాంటి వారికి ఆర్థిక సంస్థలు హోమ్ లోన్లు మరింత ఎక్కువ ఆఫర్ చేస్తాయి. ఈ ట్రెండ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వచ్చే నెల నుంచి ఇళ్లు కొనే ఓ వర్గం అభిప్రాయాల్లో వచ్చే మార్పు మార్కెట్ డిమాండ్ లోనూ మార్పులు తెచ్చే అవకాశం ఉంది.