ప్రస్తుతం ‘మాస్ జాతర’ పనిలో బిజీగా ఉన్నాడు రవితేజ. తదుపరి సినిమా కూడా దాదాపు ఫిక్స్ అయినట్టే. క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు. కథ ఇప్పటికే వినిపించేశారు. ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే పేరు ఖరారు చేశారని వార్తలొస్తున్నాయి. ఈ కథలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఆ ఇద్దరూ ఎవరన్న ఆసక్తి నెలకొంది. హీరోయిన్ల రేసులో రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మమితా బైజు, కయాడు లోహార్ లను ఈ పాత్రల కోసం ఎంచుకొన్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రేమలు సినిమాతో పాపులారిటీ సంపాదించుకొంది మమితా. ఇక కయాడు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల విడుదలైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో దుమ్ము దులిపింది. వీరిద్దరూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టినవారే. పైగా ట్రెండింగ్ లో ఉన్నారు. కిషోర్ తిరుమల కథల్లో నాయికలకు సైతం ప్రాధాన్యత ఉంటుంది. ఇటు అందం, అటు అభినయంతో రాణించాల్సిన ఈ పాత్రల్లో మమిత, కయాడు విజృంభిస్తారన్నది అందరి నమ్మకం.
2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్రయత్నం. అది జరగాలంటే వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలి. ఈ నెలాఖరున ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ రావొచ్చు.