ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు దాదాపుగా ఫిక్సయిపోయినట్టే. హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. మరో వైపు ఎన్టీఆర్ కోసం కొత్త కథలు రెడీ అవుతున్నాయి. ‘డాక్టర్’, ‘జైలర్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్.. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం ‘ROCK’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఏ టైటిల్ పెట్టినా పాన్ ఇండియా ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకోని పెట్టాల్సిందే. ‘రాక్’ అయితే అందరికీ అర్థం అవుతుందన్న ఉద్దేశంతో నెల్సన్ ఈ టైటిల్ వైపు మొగ్గు చూపిస్తున్నాడని సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. నాగవంశీ నిర్మాత. 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్సన్ యాక్షన్ సినిమాల్ని బాగా తీర్చిదిద్దగలడు. కామెడీ సెన్స్ కూడా ఉంది. ఇవి రెండూ మిక్స్ చేసి ‘రాక్’ కథని అల్లుకొన్నాడని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.