రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటిసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లను పేర్కొన్నారు. అంటే ఇవి సోషల్ మీడియా కేసులు కాదని..అంతకు మించిన కేసులు అని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆడిట్ రిపోర్టులతో భయపటెట్ి వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి వాటాలు రాయించుకున్నారు. ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
విజయసాయిరెడ్డికి సీఐడీ పిలుపుఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ సీఐడీ ప్రశ్నించలేదు. బుధవారం ఆయన సీఐడీ ప్రశ్నలను ఎదుర్కోనున్నారు. అయితే పోర్టులో వాటాలను .. తిరిగి కేవీరావుకు ఇచ్చేసి రాజీ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో స్పష్టత లేదు.బుధవారం విజయసాయిరెడ్డి సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకూడదన్న ముందస్తు ఆదేశాలేమీ లేవు. అందుకే అలాంటి ఆదేశాల కోసం కోర్టుకెళ్లి విచారణకు డుమ్మా కొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.