వ్యాసకర్త
యార్లగడ్డ వెంకట్రావు
ప్రభుత్వ విప్ & గన్నవరం శాసన సభ్యులు
KDCC బ్యాంకు చైర్మెన్ గా ప్రవేశ పెట్టిన పధకాలు / చేసిన సంస్కరణలు.
ప్రస్తుత సంస్కరణల ఆవశ్యకత. ఆరుగాలం కష్టపడే రైతాంగం కోసం మహానుభావులు ఆరోజు AICC ప్రెసిడెంట్ గా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1915 లో కేడీసీసీ బ్యాంకు, 1923 లో ఆంధ్ర బ్యాంకు పెట్టినా, తొలి శాసనసభ స్పీకర్ గా పనిచేసిన అయ్య దేవర కాళేశ్వరరావు గారు 1918 లో విజయవాడ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పెట్టినా, వీరు పరోపకార్థం ఇదం శరీరం అన్నట్లు ప్రజల కోసం బతికారు. అటువంటి మహానుభావులు పెట్టిన బ్యాంకులకు ఇప్పుడు సంస్కరణల అవసరం ఎంతో ఉంది.
డిసెంబర్ 14, 2019 నుండి ఫిబ్రవరి 12, 2021 వరకు నేను KDCC బ్యాంకు చైర్మెన్ గా పనిచేసిన సమయంలో 5200 కోట్ల టర్నోవర్, 15 కోట్ల నికర లాభంగా ఉన్నటువంటి కృష్ణ DCCB దాదాపు 8000 కోట్ల టర్నోవర్ 80 కోట్ల నికర లాభానికి వచ్చే విధంగా నేను అభివృద్ధి చేస్తే ఎవరైనా ప్రమోషన్ ఇస్తారు. కాని గత వైసిపి ప్రభుత్వం డిమోషన్ ఇచ్చి తొలగించింది. ఇది గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఉదాహరణ .. అభివృద్ధి పట్ల గత ప్రభుత్వ వైఖరి.. మిగతా 12 మందిని Extend చేసి దేశంలో No .1 లో పెట్టిన నన్ను తొలగించింది.
KDCC చైర్మెన్ గా చేసిన పథకాలు / సంస్కరణలు:
మొట్టమొదటగా, బ్యాంకు వ్యవస్థాపకులైన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య మరియు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గార్ల చిత్ర పటాలను జిల్లాలోని 425 PACS ల లో మరియు 58 బ్రాంచెస్ లో ఏర్పాటు చేసిన పరిస్థితి. సింగిల్ పాయింట్ ఎజెండగా కృష్ణాజిల్లాలోని 996 గ్రామాల్లోని రైతు సోదరులెవ్వరు రెండు రూపాయల వడ్డీకి అప్పు తీసుకోకూడదు. జిల్లా నుండి రెండు రూపాయలు వడ్డీని తరిమికొట్టాలని లక్ష్యంతో బ్యాంకు ద్వారా 80 పైసలకే కర్షక మిత్ర పథకం ద్వారా 20 లక్షలు చొప్పున దాదాపు 700 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. రైతుల గృహావసరాలకు, వివాహాది శుభకార్యాలకు, బంగారు నగల కొనుగోలుకు రైతునేస్తం ఋణ పధకం ద్వారా కేవలం రూ.0.83 పైసలు వడ్డీకి 16 లక్షల వరకు రుణం పొందే సదుపాయం కల్పించి 1500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జిల్లా రైతులు, ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ చెల్లిస్తూ 2020 సం” లో ప్రత్యేక డిపాజిట్ల సేకరణ మహోత్సవం ద్వార రూ.207 కోట్ల రూపాయల సేకరణ చేసిన పరిస్థితి. బంగారు నగల హామీ ఋణాల పెంపుదల కొరకు ప్రత్యేక పధకాన్ని ప్రవేశపెట్టి గరిష్టంగా రూ.40 లక్షల వరకు ఋణసదుపాయం కల్పించి, వీటి కోసం విజయవాడ R.O కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ 24 గంటలు లాకర్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. రైతులు గాని, కౌలు రైతులు గాని చనిపోతే 1,00,000/- రూపాయలు చొప్పున ఇచ్చిన పరిస్థితి. రైతులకు చెందిన ఎడ్లు ప్రమాదవశాత్తు మరణింస్తే రూ.25,000/- ఆర్ధిక సహాయం ఏర్పాటు చేసిన పరిస్థితి. సహకార చట్టం ప్రకారం 40 లక్షలకు పైబడి రుణం ఇవ్వకూడదని రూల్ ఉండడం వల్ల, ఎకరానికి ఆరు లక్షల రూపాయల చొప్పున గరిష్టంగా ఒక్కో రైతు సోదరుడికి 40 లక్షల వరకు రుణం కల్పించిన పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరికీ జీతాలు పెంచడం జరిగింది.
రైతులు వ్యవసాయానికి దూరమై కౌలు రైతుల చేతుల్లో ఉండగా రైతు బిడ్డల కన్నా ఈ బ్యాంకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారిగా పొలం తాకట్టు ద్వార రైతు బిడ్డలకు కోసం విద్య రుణాలు, విదేశి విద్య కొరకు 30 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడినది. బిజినెస్ ఓవర్ డ్రాఫ్తులు 60 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. 100 మందికి పెర్మనెంట్ ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి . 120 మంది విద్యార్థులకు ఇంటెన్షిప్ కల్పించడం జరిగింది.
కృష్ణాజిల్లాలో మొత్తం 425 DCCB ల్లో మరియు 58 బ్రాంచ్ లలో , షుమారు 500 మంది సిబ్బంది 100 మంది, కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. Video కాల్ కు అవసరమైన equipment ను అన్ని బ్యాంకులలో ఏర్పాటు చేసి , పక్షం రోజులకొకసారి బ్యాంకు అభివృద్ధి మరియు అధికారుల పని తీరుని రివ్యూ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని. సీఈఓలు, జిఎంలు, ఏజిఎంలు, పై స్థాయి అధికారులు అందరూ కుడా ఒకే యూనియన్‌లో ఉండడం వల్ల క్రింది స్థాయి ఉద్యోగులకు మేలు జరగదనే ఉద్దేశం నాకు అనిపించి వారితో చెప్పగా .. నా హయాంలో ఉద్యోగస్తులందరూ యూనియన్ కి దూరంగా ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయిస్ , రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్స్ కు తక్కువ వడ్డీకి రుణాలు కల్పించిన పరిస్థితి. కేడీసీసీ బ్యాంకు వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే నా ఆకాంక్షకు పూర్తి సహాయ సహకారాలు అందించి, కరోనా సమయంలో కుడా బాగా పనిచేసినందుకు బ్యాంకు సిబ్బందికి మూడు నెలల జీతం బోనస్ ఇచ్చిన పరిస్థితి. ముత్తూట్ ఫైనాన్స్ మణప్పురం ఫైనాన్స్ వంటి ప్రైవేటు కంపెనీల బారి నుండి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో KDCCB గోల్డ్ బ్రాంచ్ లు ఏర్పాటు కోసం RBI కి అప్లై చేస్తే, పర్మిషన్ నేను చైర్మన్ గా దిగిపోయిన తర్వాత వచ్చింది. అయినా నేటికీ గోల్డ్ లోన్ బ్రాంచ్ లు పెట్టలేదు.
రాజకీయాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా! కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా 13 నెలలు పని చేసిన కాలంలో రైతులకు ఇతోధికంగా సేవ చేశానన్న ఆత్మ సంతృప్తి ఉంది, దాదాపు 3,53,000 మంది రైతులకు న్యాయం చేశాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాకి ఈ బ్యాంకు చరిత్రలో ఒక పేజీ అనేది ఉండేలా పనిచేస్తానని బ్యాంకు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం రోజునే నేను చెప్పాను. ఎన్నో సంస్కరణలతో బ్యాంకుని అభివృద్ధి పథంలో నడిపించి KDCC బ్యాంకును దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పెట్టానన్న కించిత్ గర్వం కూడా ఉంది.. ఈ జిల్లా ప్రజలు 2020 లో నా పుట్టినరోజున దాదాపు 300 గ్రామాల్లో నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు పెట్టడం నాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చింది. ప్రజలకు మంచి చేస్తే ముఖ్యంగా రైతాంగానికి మంచి చేస్తే వాళ్ళు చూపించే ఆదరణ ఈ విధంగా ఉంటుందని నేను ప్రత్యక్షంగా చూశాను, రైతు బిడ్డగా నా వంతు సేవలను రైతులకు అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
APCOB – సాఫ్ట్వేర్ కొనుగోలు – అక్రమాలు :
డిసిసిబి చైర్మన్ గా ఉన్న కాలంలో, 13 జిల్లాల సహకార సంఘాల అధ్యక్షులతోపాటు, నేను కంప్యూటరైజేషన్ కమిటీకి చైర్మన్ గా పోలరీస్ సాఫ్ట్వేర్ పనికి రావడం లేదని అంటే అప్-డేట్ చేస్తే సరిపోతుందని పోలరీస్ ని పిలిపించమని అన్నాం, వాణి మోహన్ IAS (Commissioner, Cooperation and Registrar of Cooperative Societies) గారు కూడా నాతో ఏకీభవించారు, పోలరీస్ ఎంత పెద్ద కంపెనీ అయినా మనం క్లైంట్, అతను వెండార్ కాబట్టి వాళ్ళు రావాల్సిందే, పిలిపించమని అంటే పిలిపిస్తామని చెప్పి పిలిపించని పరిస్థితి. పోలరీస్ సాఫ్ట్వేర్ ను అప్-డేట్ చేస్తే సరిపోయేది. APCOB పొలారిస్ నుంచి కొన్న software కి 5 కోట్ల రూపాయలు KDCCB చెల్లించింది. APCOB 2023 లో TCS నుండి software కొనుగోలు చేసారు, అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఆంధ్ర బ్యాంక్ 2013 లో తీసేసింది.. నేను ఉన్న 13 మాసాల కాలంలో ఆ సాఫ్ట్వేర్ జోలికి గాని, కంప్యూటర్లు కొనడానికి గాని వెళ్ళని ఆనాటి అధికారులు, ఆనాటి ప్రభుత్వం, నేను తప్పుకోగానే అక్రమాలకు ఒడికట్టారు. కచ్చితంగా అవినీతి జరిగింది. దీనిమీద విచారణ చేయాలి.
దాదాపుగా 10 సంవత్సరాల క్రితం తీసేసిన సాఫ్ట్వేర్ ఎవరైనా కొంటారా? ఇది చాలా నిర్లక్ష్యమయిన, అవినీతిమయిన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఆంధ్ర బ్యాంకు, KDCC బ్యాంకు రెండు పెట్టిన మహానుభావుడు ఒక్కరే అవ్వడం విధి-విచిత్రం, రెండు సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఆయన వల్లే సంస్థల్లో కొనసాగుతున్నారు. ఆయన రైతుల కోసం పెడితే ఆ బ్యాంకుల్లో పనిచేసే కొంతమంది అధికారులు అవినీతి ఆలవాలంగా తయారయ్యారు. లోగుట్టు పెరుమాళ్ళకు కెరుక. APCOB ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా చోద్యం చూడడం అభ్యంతరకరం,.. బాధాకరం.. అంగీకర యోగ్యం కాదు. గత ప్రభుత్వం లో APCOB కొన్న అవుట్ డేటెడ్ సాఫ్ట్వేర్ కొనుగోలు పై విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల DCCB ల మీద ఎంక్వయిరీ వేయమని జులై నెలలో లెటర్ రాస్తే స్పందించిన పరిస్థితి. నవంబరు లో శాసనసభలో చెప్పాను . నా విజ్ఞప్తికి స్పందించి మంత్రి 51 ఎంక్వయిరీకి ఆదేశించారు. విచారణ వేగవంతంగా జరగాల్సిన పరిస్థితి. ఈ ఎంక్వయిరీలో దోషులు గ్యారంటీగా పట్టుబడతారు వారిని శిక్షిస్తాం.
PACS సెక్రెటరీల అధికార దుర్వినియోయోగం:
PACS సెక్రెటరీల పదవి కాలం మొత్తం వారు జాయిన్ అయిన ఊర్లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి. వారు సర్వీస్ మొత్తం దాదాపు 35 సo”లు ఒకే బ్యాంకు నందు పనిచేస్తూ కొంతమంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పరిస్థితి. PACS సెక్రటరీలకు ట్రాన్స్ఫర్స్ లేక పోవడం అనేది ఇది చాలా దారుణం. అమానుషం కూడా. ఆ ఊర్లో బ్యాంకు ప్రెసిడెంట్ చదువుకోని వాళ్ళు అయితే, వీరే పెత్తనం చేస్తున్న పరిస్థితి. వాళ్లకి ట్రాన్స్ఫర్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని నేను ప్రభుత్వం నుంచి PACS సెక్రటరీల ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కష్టపడి ఒప్పించి HR పాలసీ రెడీ చేసి ఇచ్చి జీవో నెం: 90 తీసుకొచ్చిన పరిస్థితి. కాని జీవో నెం: 90 అమలకు మాత్రం నోచుకోలేదు, ఈ గురుతర బాధ్యత మన ఈ మంచి ప్రభుత్వం పైనే ఉంది. కనుక ఈ జీవో నెం: 90 ని అమలు చేస్తే ఈ పిఎసిఎస్ సెక్రెటరీల వ్యవస్థ లో కొంతవరకు ప్రక్షాళన జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ అప్పుడు పాతవాళ్లు తప్పు చేస్తే కొత్త వాళ్లకు చార్జ్ అప్ప చెప్తున్నప్పుడు తెలుస్తాయి. అలాగే విధిగా ఆడిటింగ్ చేస్తే ఏవైనా తప్పులు ఉంటె వెంటనే బయటపడే అవకాశం ఉంది.
అడ్డగోలుగా నియామకాలు, ప్రమోషన్లు మరియు అక్రమాలు:
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో మూడు సంవత్సరాలకు మించి ఒకే చోట ఉద్యోగం చేయకూడదు. అటువంటి రూల్స్ కి కుడా DCCB లు తిలోదకాలు ఇచ్చిన పరిస్థితి. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో పెద్ద స్థాయిలో జిఎంలు, ఏజీఎంలు ఒకే యూనియన్ లో ఉండడం వల్ల, వాళ్లకు కావలసిన వాళ్ళకి కావలసిన చోట పోస్టింగులు, ప్రమోషన్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు విజయవాడ నగరంలో ఉన్న బ్రాంచీలను తీసుకుంటే, 20 సంవత్సరాలగా 60 – 80 మంది మాత్రమే విజయవాడ లో పని చేసిన వారే పని చేస్తున్నారు. మిగతా వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్ లాగా పక్క ఉళ్ళలో పనిచేస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులు తెలియనివాళ్లు విసిరేసినట్లుగా ఆ మూల ఒకరు .. ఈ మూల ఒకరు.. జగ్గయ్యపేట, కైకలూరు వంటి బ్రాంచీలలో పనిచేస్తున్నారు.
పాలకులు, కొంతమంది అధికారుల అవినీతి కారణంగా బ్యాంకు నిధులు దుర్వినియోగం అవుతున్న పరిస్థితి. 2024 జనవరి నెలలో వివిధ కేడర్లకు అవకతవకలతో కూడిన ప్రమోషన్లు ఇచ్చిన పరిస్థితి. ఏప్రిల్ 2021 తర్వాత బ్యాంకులో స్వంత వారిని దాదాపు 80 మందిని దినసరి వేతనం ఇచ్చేలా నియమించిన పరిస్థితి. బ్యాంక్ భవనాలు డైరెక్టర్స్ కట్టడం, కొన్ని భవనాలు CRDA అనుమతులు కూడా లేకుండా కట్టడం అమానుషం. బ్యాంకు సిబ్బందికి, రైతులకి చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియంలలో KICK BACK లు తీసుకున్నారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా ఉన్నప్పుడు 30 లక్షలు తగ్గిస్తే గత సంవత్సర ప్రీమియం అదనంగా 115 లక్షలు చెల్లించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఒక GM వల్లే ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం పైగా ఇబ్బంది పడుతోందని కొంత మంది ఉద్యోగులే కాదు బ్యాంకు గోడలు కూడా చెప్పే పరిస్థితి.
సంస్కరణలు ఆవశ్యకత :
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన శక్తిగా ఉన్న సహకార శాఖ గతంలో మన రాష్టంలో విడిగా సహకార మంత్రిత్వ శాఖ గా ఉండేది. తర్వాత వ్యవసాయ శాఖ లో మెర్జ్ చేయడం వలన ఆ శాఖ నిర్వీర్యం ఐయ్యింది. ఇప్పుడు కోపరేటివ్ శాఖను మళ్ళీ సపరేట్ శాఖగా చేస్తే మరింత పర్యవేక్షణ ఉండి బ్యాంకులు బలపడతాయనడంలో సందేహం లేదు.
కృష్ణ డిసిసిబి బ్రాంచ్ లు 58 ఉంటే, ఆప్కాబ్ కూడా బ్రాంచులు పెట్టి కార్యకలాపాలు నిర్వహించడం తెలివి తక్కువ తనానికి నిదర్శనం. దానికి బదులుగా గోల్డ్ లోన్ బ్రాంచ్ లు పెడితే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్సర్ ల అధిక వడ్డీల బారి నుంచి రైతులను, ప్రజలను కాపాడవచ్చు.
గత ప్రభుత్వంలో గవర్నమెంట్ షూరిటీతో APCOB కు AP సీడ్స్ కార్పొరేషన్ 250 కోట్లు అందించింది. 1965 యాక్ట్ ప్రకారం తాకట్టు లేకుండా లోన్ ఇవ్వకూడదనేది సహకార చట్టం. రైతుల బ్యాంకుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, మునుపు కేంద్ర లో ఈ శాఖ లేదు, అమిత్ షా గారు ఈ సహకార సంఘాల శాఖను మూడు సంవత్సరాల క్రితం కొత్తగా తీసుకుని వచ్చి ఆయనే మంత్రిగా ఉన్నారు. ఆయన డిసిసిబి చైర్మన్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. కనుక ఈ వ్యవస్థను సంస్కరిస్తారని బలంగా నమ్ముతున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకులది విస్మరించలేని పాత్ర. దీనిని ఇంకా ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది తప్ప రాజకీయ పార్టీలు దీని మీద ఉదాసీనంగా వ్యవహరించడం, ఎన్నికలు నిర్వహించకపోవడం, ఎన్నికలు లేకుండా నామినేటెడ్ గా చేయడం వలన సహకార సంఘాలలో అవినీతి జరుగుతున్న పరిస్థితి. ఈ వ్యవస్తను సంస్కరిచినట్లు అయితే సహకార బ్యాంకులు నేషనలైస్డ్ బ్యాంకులకు మరియు ప్రైవేటు బ్యాంకులకు కచ్చితంగా పోటీ పడగలవు. ఈ సమస్యలు ప్రభుత్వంలో పారదర్శకత, నైతిక మద్దతు ఇవ్వవలసిన ఉంది. గుజరాత్ లో ప్రభుత్వ డిపాజిట్లు సహకార బ్యాంకుల్లో ఉండడం వల్ల అక్కడ డిసిసిబిలు బాగున్న పరిస్థితి. వీలైతే మన ప్రభుత్వానికి సంబంధించిన డిపాజిట్లను డిసిసిబిలకు మళ్ళిస్తే మంచిదేమో!
చంద్రబాబు గారు దీని మీద దృష్టి పెడితే ఈ 13 జిల్లాల సహకార బ్యాంకులో ఎక్కడకో వెళ్తాయి. కొన్ని జిల్లాలు కడప అనంతపురం వంటివి నష్టాల్లో ఉన్నాయి. ఏలూరు, కాకినాడ, DCCBలు మరియు గుంటూరు DCCB విపరీతమైన నష్టాల్లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో డిసిసిబిలు లాభాల్లోకి రావాలంటే, APCOB కృష్ణ జిల్లాల్లో అమలవుతున్న పథకాలను కాపీ చేసి మిగతా జిల్లాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ABCOP టర్నోవర్ 40,000 కోట్లు పైగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింహ భాగం 11,500 కోట్ల వ్యాపారం కృష్ణాజిల్లా నుంచే ఉంది. ఆప్కాబ్ ఈ సాఫ్ట్వేర్ విషయంలో డెఫినెట్‌గా తప్పు చేసింది, గోల్డ్ లోన్ బ్రాంచీలు పెట్టకుండా ఇక్కడ బ్రాంచ్ లు పెట్టడం ముమ్మాటికి తప్పే. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి చంద్రబాబు గారి ప్రభుత్వం కచ్చితంగా ఈ బ్యాంకులను సంస్కరిస్తుందని ఆశిస్తున్నాను. ఇది చంద్రబాబుకే సాధ్యం.
వ్యాసకర్త
యార్లగడ్డ వెంకట్రావు
ప్రభుత్వ విప్ & గన్నవరం శాసన సభ్యులు