వైసీపీ ఆవిర్బావ దినోత్సవం మార్చి పన్నెండో తేదీన. వైఎస్ కోసం చనిపోయారంటూ వారి కోసం ఓదార్పుయాత్ర చేస్తానని శవాల పునాదుల మీదే పార్టీని పకడ్బందీగా నిర్మించారు జగన్. ఆయనకు సానుభూతి పవర్ తెలుసు. అందుకే.. వైఎస్ చనిపోయిన ఏళ్ల తరబడి తన మీడియా సాయంతో దాన్ని ఉండేలా చేసుకున్నాడు. ఆ సానుభూతితో వైఎస్ కుటుంబానికి పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఒక్క తన్ను తన్ని సొంత పార్టీ పెట్టుకున్నారు. అపరిమిత సంపద ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి తన రాజకీయ నిచ్చెనలు వేసుకున్నారు. అదే సానుభూతి అస్త్రంగా కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకున్నారు.
కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకే ఫార్ములాతో వర్కవుట్ అవవు. జగన్ రెడ్డికి సానుభూతి , కుల రాజకీయాలు తప్ప ఇంకేమీ తెలియవు. ప్రజలు ఓ సారి పదవి ఇచ్చారు. నిజానికి అది గెలుపు అని వైసీపీ అనుకుంటుంది. చెప్పాలంటే ప్రజలు అధికారం ఇచ్చి ఆయనను పాతాళంలోకి పడేశారు. జగన్ రెడ్డి ఎంత ఘోరమైన వ్యక్తో అందరికీ తెలియాలంటే.. పదవి అనేదాన్ని ఆయన ఎంత టేకిట్ గ్రాంట్ గా తీసుకుని రక్తం పీలుస్తారో తెలిసేలా చేశారు. ప్రజలు తనకు బానిసలని అనుకున్న ఆయన తాను విదిలించే పదో పరకో తీసుకుని తనకే ఎల్లకాలం ఓటు వేస్తారని అనుకున్నారు. ఆ మైండ్ సెట్ తో ఆయన చేయకూడని తప్పులు చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ? ఆయన పార్టీ ఎక్కడుంది ?
ఒక్క గెలుపుతో పాతాళానికి పడిపోయేవారు ఎవరూ ఉండరు ఒక్క జగన్ రెడ్డి తప్ప. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నేర్చుకోలేదు. ఇప్పటికీ ఆయన తాను అనుకున్న బావిలోనే ఉండిపోతున్నారు. ఆయన పాలన దెబ్బకు ఆయనను నమ్ముకున్న వారంతా పరారవుతున్నారు. కేసుల పాలవుతున్నారు. వారికి కనీసం సపోర్టు చేయలేకపోతున్నారు. చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అంతంత మాత్రం ఆవిర్భావ దినోత్సవాలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోఉన్నారు. అసెంబ్లీకి కూడా వెళ్లని జగన్ కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత ఉండదు. బెంగళూరు నుంచి వచ్చి ..జెండాఎగరేసి మళ్లీ తన దోవన తాను పోతారు. ఇలాంటి పార్టీ మనుగడ సాగిస్తుందని ఎవరైనా అనుకోగలరా?