ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తొమ్మిది నగరాలుగా విభజించి వివిధ రంగాల కోసం కేటాయించారు . ఇందు కోసం 35 వేల ఎకరాలను భూసమీకరణ చేశారు. ఆ తర్వాత గ్రామాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. అమరావతి కోర్ క్యాపిటల్ కు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఊళ్లల్లో ఇప్పుడు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కంతేరు.
అమరావతి సమీపంలోని కంతేరులో గతంలోనే పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వేశారు. అయితే మాడు రాజధానుల కారణంగా ఐదేళ్ల పాటు లావాదేవీలు లేకుండా పోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరవాత మళ్లీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. హైదరాబాద్ లో భారీ ప్రాజెక్టులు చేపట్టే అపర్ణా, వెర్టక్స్ లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నాయి. గ్రీన్ సరౌండింగ్ తో మంచి వెంచర్లను డెలవప్ చేశారు. దాదాపుగా అన్ని వెంచర్లలోనూ లగ్జరీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 40 అడుగుల వెడల్పైన బీటీ రోడ్లు, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్‌తో ల్యాండ్‌స్కేప్డ్ పార్క్స్, సిగ్నేచర్లతో రోడ్లు, ఆర్ఓ వాటర్ ఫ్యూరిఫైయర్స్ వంటివి ఉంటున్నాయి. కంతేరు ఏరియాలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లు వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్లాట్లు కొనే వారి సంఖ్య పెరిగింది. ఈ నెలాఖరులో అమరావతి పనులు ప్రారంభం కానున్న తరుణంలో డిమాండ్. మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.