డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగారు శివాజీ. విలక్షణ నటుడిగా పేరు తెచుకున్నారు. రాష్ట్ర విభజన, తదనంతరం జరిగిన పరిణామాలు సమయంలో బలమైన గొంతుక వినిపించారు శివాజీ. ఒక దశలో టీడీపీ మనిషిగా ఆయనపై ముద్రపడింది. అయితే తనకు పార్టీలతో సంబంధం లేదని, అన్యాయన్ని ప్రశ్నించి ప్రజల గొంతుక వినిపించడమే తన లక్ష్యమని ప్రకటించారు.
దాదాపు 12 ఏళ్ళు సినిమాలకి దూరంగా వున్న శివాజీ బిగ్ బాస్ షో తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. 90s వెబ్ సిరిస్ కూడా ఆయన రీఎంట్రీకి మంచి ఫ్లాట్ ఫాం గా మారింది. తాజాగా విడుదలైన కోర్ట్ సినిమాలో ఆయన చేసిన మంగపతి పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హైలెట్ నిలిచే పాత్ర శివాజీదే అని ప్రశంస దక్కింది. దాదాపు 25 ఏళ్ళుగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచుశాని, ఈ సినిమాతో ఒక కల తీరిందని చెప్పుకొచ్చారు శివాజీ.
ఇదే సమయంలో రాజకీయాల గురించి తనదైన శైలిలో స్పందించారు. నేను ఏనాడూ పార్టీలని బలోపేతం చేయడానికి పని చేయలేదు. టీడీపీకి బలమైన నాయకుడు చంద్రబాబు, వైసీపీకి జగన్, జనసేనకి పవన్ కళ్యాణ్ వున్నారు. వాళ్ళు పార్టీలని స్ట్రాంగ్ గా చేసుకోగలరు. వీక్ గా వున్నది ప్రజలే. ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగుతునప్పుడు స్పృహ కలిగిన మనిషిగా మాట్లాడాను తప్పితే నాకు ఏ రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటికీ నాది ప్రజల పక్షమే’ అని చెప్పుకొచ్చారు శివాజీ.