పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవరం కలర్ ఫుల్‌గా సాగింది. ఎప్పుడు జనసేన సభలు, ఆవిర్భావాలు జరిగినా ఫ్యాన్స్ సృష్టించే గందరగోళంతో పవన్ కల్యాణ్ ఆవేశ పూరిత ప్రసంగాలతో సాగిపోయేవి. కానీ. ఈ సారి మాత్రం చాలా ప్రణాళికాబద్దంగా సభను నిర్వహించారు. అయితే పవన్ కల్యాణ్ స్పీచ్‌లో మార్పులు లేవకపోవడం పార్టీ పెట్టినప్పటి నుంచి చెబుతున్న మాటలే చెప్పడంతో భవిష్యత్ పై దిశానిర్దేశం ఏది అన్న సందేహం సాధారణ జనసైనికులు వస్తోంది.
జ్ఞాపకాలతోనే సాగిన పవన్ స్పీచ్
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తాను ఎందుకు పార్టీ పెట్టానో చెప్పారు. గత పదకొండేళ్లుగా చెబుతూనే ఉన్నారు . తన కుటుంబంలో తనను ఎలా చూశారు.. తన సినిమాలు ఇలా చాలా కుబుర్లు ఎప్పటి నుంచే చెబుతున్నారు. తనకు పార్టీ పెట్టే అర్హత ఉందన్నారు. ఇవన్నీ ఆయనను ఎవరూ అడగలేదు. పార్టీ పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్లీనరీ వేదికగా పార్టీ సిద్దాంతాలను.. విధానాలను కార్యకర్తలకు ప్రజెంట్ చేయాలి కానీ ప్రసంగం జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానకే ఎక్కువ సమయం కేటాయించారు.
పవన్ ను పొగడటమే నాగబాబు సహా అందరి ఎజెండా !
జనసేన సభా వేదికపై చాలా మంది ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ చాన్సిచ్చారు. బాలినేని లాంటి కొత్తగా పార్టీలో చేరిన వారికి చాన్సిచ్చారు. అయితే ఒక్కరూ ఇప్పటి వరకూ సాధించింది ఓకే.. ఇక ముందు ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చలు జరపలేదు. పవన్ కల్యాణ్ ను మహానీయుడు అనే దగ్గర నుంచి తాము పిఠాపురం తాలూకా అని చెప్పుకునేదాకా పొగిడారు. నాగబాబు అయితే మరిన్ని అతిశయోక్తులు చెప్పారు. పార్టీ నాయకులకు అధినేత గొప్పే కానీ.. ప్లీనరీలో దిశానిర్దేశం అనేది మొదటి టాపిక్ అయి ఉండాలి కదా !
నిలబెట్టామన్న వ్యాఖ్యలతో నొచ్చుకుంటున్న టీడీపీ
పిఠాపురంలో పవన్ విజయం ఎవరి వల్ల అయినా వచ్చిందని అనుకుటే అది వారి ఖర్మ అని .. ఓటర్లే గెలిపించారని నాగబాబు అన్నారు. ఇప్పుడు టీడీపీనీ తామే నిలబెట్టామని చెప్పుకున్న పవన్ కు ఇది వర్తిస్తుందా అనేది ఎక్కువ మందికి వస్తున్న డౌట్. కూటమిగా పార్టీలు పోటీ చేశాయి. ఎవరూ ఎవర్నీ నిలబెట్టలేదు. అన్ని పార్టీలు కలిసి కట్టుగా నిలబడ్డాయి. ఆ స్ఫూర్తిని మాత్రం కొనసాగిస్తామన్న సందేశాన్ని పవన్ ఇవ్వలేకపోయారు.