వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కుటుంబసభ్యుడు, మాజీ వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఆస్తులను, తన వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారని కన్నీరు పెట్టుకున్నారు. అన్ని విషయాలను బయట పెడతానన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తులను జగన్ కాజేసాశారో లేదో ఆయన ఆ వివరాలను బయట పెడతారో లేదో కానీ.. బాలినేని అన్న మాటల్ని నమ్మేవాళ్లు 99 శాతం ఉంటారు. వైసీపీ కార్యకర్తలు కూడా బయటకు నమ్మడం లేదని చెబుతారు కానీ.. జగన్ లాక్కునే ఉంటారని మనసులోనో.. ప్రైవేటు సంభాషణాల్లోనే అంగీకరిస్తారు. ఎదుకంటే జగన్ ఇమేజ్ అలాంటిది మరి.
ఆస్తులు కాజేయడం కూడా ఓ మానసిక రోగమే
ఎంత ఆస్తి ఉన్నా కొంత మంది షాప్ లిఫ్టింగ్ చేసి దొరికిపోతూ ఉంటారు. వారు దొంగతనం చేసే వస్తువులు అసలు లెక్కే కాదు. కానీ అదో రోగం. షాప్ లిఫ్టింగ్ అనేది ఓ రోగం. జగన్ కు కూడా అలాంటి రోగం ఉందని అనుకోవచ్చు. అయితే జగన్ రేంజ్ పెద్దది కాబట్టి దానికి తగ్గట్లుగా ఆయన ఆస్తులు కాజేస్తూ ఉంటారు. జగన్ తమ ఆస్తులు కాజేశారని ఆరోపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా మరికొంత మంది ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తల్లి, చెల్లి ఆస్తులు కూడా కాజేశారు గా !
జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల కాజేయడం అనేది ఎంత బలమైన రోగంగా మారిందో కళ్ల ముందే ఉంది. ఆయన తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకపోగా ఉన్న ఆస్తులను కాజేందుకు కోర్టుకెళ్లారు. ఈ అంశంపై షర్మిల కూడా మండిపడ్డారు. పిల్లల ఆస్తులు కొట్టేయాలనుకుంటున్నారని తీవ్ర స్వరంగా విరుచుకుపడ్డారు. విజయమ్మ కోర్టులో అదే చెప్పారు. సరస్వతి పవర్ తనదని జగన్ కొట్టేయాలనుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు బాలినేని తన ఆస్తులు కాజేశారని చెప్పుకొచ్చారు.
జగన్ కేం తక్కువ ఇతరుల ఆస్తులెందుకు?
జగన్మోహన్ రెడ్డికి ఏం తక్కువ లేదు. వైఎస్ సీఎం కాక ముందు సబ్ కాంట్రాక్టుల కోసం సిఫారసులు చేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆయన పంట పండిపోయింది. వేల కోట్లు.. బినామీల పేర్ల మీద..సూట్ కేసు కంపెనీల ద్వారా లక్షల కోట్ల ఆస్తులున్నాయి. మరి తల్లి , చెల్లి, బాలినేని వంటి వారి ఆస్తులను కాజేసి ఏం చేసుకుంటారు ?. ఆయనకు డబ్బుల కొరత లేదు. ఇతరుల ఆస్తుల్ని కాజేయడం ఆయనకు ఓ రోగం అంతే. దానికి మందు ఉందో లేదో ఆయనకే తెలియాలి.