వైఎస్ జగన్ తన మద్యం విధానంతో ప్రజల రక్త మాంసాలను పీల్చారు. అంతే కాదు పొరుగు రాష్ట్రాలకూ వేల కోట్ల ఆదాయాన్ని ధారబోశారు. ఈ విషయం ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయట పడుతోంది. జే బ్రాండ్ చీప్ లిక్కర్లను వేలు పెట్టి కొనడం కన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరకు మంి బ్రాండ్లు తెచ్చుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని మందు బాబులు కల్పించి పొరుగు రాష్ట్రాల పంట పండించారు.
తెలంగాణకు తగ్గిన 11 వందల కోట్ల మద్యం ఆదాయం
తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 11 వందల కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్లుగా తాజాగా లెక్కలు బయటకు వచ్చాయి.తాగే వారు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు కదా.. తగ్గడం ఏంటి అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ తెలంగాణలో తాగేవారు తగ్గలేదు.. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి తాగేవారు తగ్గారు. వచ్చినప్పుడల్లా ఓ రెండు బాటిళ్లు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేవారు తగ్గిపోయారు. ఫలితంగా తెలంగాణకు ఆదాయం తగ్గిపోయింది.
పొరుగు రాష్ట్రాల పంట పండించిన జగన్
జగన్ అధికారంలో ఉన్నప్పుడు మధ్యం ధరలు ప్యాలెస్ పైన ఉండేవి. అందులో సగం ధరకే పొరుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్స్ మద్యం లభించేది. అందుకే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుంచి ఏపీలోకి మద్యం విస్తృతంగా వచ్చేది. వైసీపీ నాయకులు చాలా మందికి మద్యం స్మగ్లింగ్ అనేది ఓ ఆదాయవనరు. ఎంత స్మగ్లింగ్ చేసిన అది పొరుగు రాష్ట్రాల్లో కొనాల్సిందే. అందుకే వారి ఆదాయం పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి..పాత బ్రాండ్స్ అన్నీ అందుబాటులోకి తేవడంతో ఆ ఆదాయం ఏపీ ప్రభుత్వానికే వస్తోంది. పొరుగు రాష్ట్రాలకు మన ఆదాయం వెళ్లడం తగ్గిపోయింది.