టెస్లా ప్లాంట్ ఇండియాలో పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ఆ ప్లాంట్ కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ కూడా అందులో ఒకటి. అయితే ఇతర రాష్ట్రాల ప్రయత్నాలు ఎలా ఉన్నాయో కానీ ఏపీ మాత్రం .. ప్రతిపాదనలు పేపర్ల మీదనే కాకుండా.. వెంటనే పనులు చేసుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా రెడీ చేసి ఆ విషయాన్ని టెస్లా ముందు ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీకి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ సముద్ర తీరం. పోర్టులు. ఈ అనుసంధానం ఉన్న స్థలాలనే టెస్లా పరిశీస్తుంది. అందుకే మూడు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి.. అక్కడ భూమి సిద్ధంగా ఉంచి.. టెస్లాకు ప్రతిపాదనలు పంపుతున్నారు. కియా పరిశ్రమ సక్సెస్ గురించి ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సంస్థప్లాంట్ ఎంత వేగంగా నిర్మించింది.. ఎంత వేగంగా ఉత్పత్తి ప్రారంభించిందన్నది ఓ రికార్డు. అంతకంటే వేగంగా ప్లాంట్ నిర్మాణం అయ్యేలా సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
అంతర్గతంగా టెస్లా ప్లాంట్ కోసం పై స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఆ ప్రయత్నాలు సీక్రెట్ సాగుతున్నాయి. తమ వ్యూహాలేమిటో ఇతర రాష్ట్రాలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కియాను తీసుకు వచ్చినప్పుడు కూడా చివరి క్షణం వరకూ బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు టెస్లా విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.