కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అర్జున్ S/O వైజయంతి’. ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయశాంతిని పాత్రని పోలీస్ ఆఫీసర్ గా పరిచయం చేస్తూ టీజర్ మొదలైయింది. ‘నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా. చచ్చింది శత్రువైనా చంపింది బంధువైనా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ ఇది టీజర్ లో వైజయంతి డైలాగ్. ఈ డైలాగ్ తో సినిమా కాన్ ఫ్లిక్ట్ అర్ధమౌతోంది.
వైజయంతి తన కొడుకు అర్జున్ ని పోలీస్ గా చూడాలనుకుంటుంది కానీ అనుకోని పరిస్థితుల వల్ల అర్జున్ వేరే దారి ఎన్నుకోవాల్సి వస్తుంది. అప్పుడు తల్లీ కొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురైయ్యాయనేది ఆసక్తికరం. టీజర్ లో ఫుల్ యాక్షన్ వుంది. కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు. విజయశాంతి పాత్ర పవర్ ఫుల్ గా వుంది. బీజీఎం, కెమరా వర్క్ యాక్షన్ సినిమాలకి తగ్గట్టుగా వుంది. సినిమా కథ కథనాలు ఎలా ఉంటాయో టీజర్ తో ఒక ఐడియా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.