‘డబుల్ ఇస్మార్ట్’ తరవాత పూరి జగన్నాథ్ చాలా రోజులు సైలెంట్ అయిపోయాడు. హైదరాబాద్ లోనూ లేడు. దాంతో పూరి ఏం చేస్తున్నాడు? ఎవరితో సినిమా చేస్తున్నాడు? అనే విషయాలపై డైలామా ఉండేది. గోపీచంద్, నాగార్జునలకు కథలు చెప్పాడని, వాళ్లతో సినిమాలు చేయనున్నాడని వార్తలొచ్చాయి. అయితే సడన్ గా విజయ్ సేతుపతి పేరు బయటకు వచ్చింది. విజయ్‌తో పూరి ఓ సినిమా చేయడం పక్కా అయిపోయింది. విజయ్ సేతుపతి కథలకు ప్రాధాన్యం ఇచ్చే హీరో. తను సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకే చేసేశాడు. వెంటనే కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.
పూరి కూడా ఈ సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. టెన్టెటీవ్గా ఓ టైటిల్ ని కూడా అనుకొన్నాడట. పూరి ఈసారి జోనర్ మార్చాడని, తనది కాని స్టైల్ లో వెళ్లి సినిమా తీయబోతున్నాడని, మేకింగ్ లో కూడా కొత్త పూరి కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పూరి స్టైల్ ఆఫ్ సినిమాలు ఓ దశలో ఆడాయి. పూరి మార్క్ మాస్‌కి నచ్చింది. అయితే ఆ తరవాత వచ్చిన ప్రతీ దర్శకుడూ పూరి స్టైల్‌ని, మేకింగ్ ని ఫాలో అవ్వడంతో `రొటీన్` అనే ఫీలింగ్ వచ్చేసింది. పూరి సినిమాలు ట్రాక్ తప్పడానికి కారణం అదే. అందులోంచి పూరి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. విజయ్ సేతుపతి సినిమాతో పూరి తన పంథా మార్చడానికి కారణం కూడా ఇదే. ఈ సినిమా కోసం పూరి పూర్తిగా కొత్త టీమ్ తో పని చేయబోతున్నాడని, పాత టీమ్ ని పక్కన పెట్టేశాడని చెప్పుకొంటున్నారు. ఏప్రిల్, మేలలోనే ఈ సినిమా మొదలవుతుందని, ఈ యేడాదే విడుదల చేయడానికి పూరి రెడీ అవుతున్నాడని టాక్.