ఐపీఎల్ 2025 సీజన్ కి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ధనాధన్ ఫార్మేట్ షురూ కాబోతోంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోలకత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ ప్రతి సీజన్లో కామన్ గా వినిపించే ఒకటే ప్రశ్న ..ఈసారైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్ కొడుతుందా? ఇంతలా కోరుకొవడానికి ప్రధాన కారణం.. విరాట్ కోహ్లీ. ఐపిఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అదే జట్టుకికి ఆడుతున్నాడు విరాట్. టీమిండియా స్టార్ ఆటగాడిగా అతడి రికార్డుల గురించి చెప్పనవసరం లేదు. రెండు ప్రపంచ కప్పులు, రెండు ఐసిసి టైటిల్స్.. ఎన్నో విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. కానీ ఐపీఎల్ టైటిల్ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలింది.
లీగ్ ప్రారంభం నుంచి బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు విరాట్. ఆర్సీబీ అంటే స్టార్ అట్రాక్షన్ కి కొదవలేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ ఆ జట్టు కోసం ఆడారు. పేపర్ మీద టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ కొన్ని సీజన్స్ జట్టుకి నాయకత్వం వహించాడు. అయినా ఆ జట్టు రాత మారలేదు. ఎప్పుడూ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకే దిగి ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మూడుసార్లు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది.
ఈసారి టీమ్‌లో చాలా మార్పులు జరిగాయి. రజిత్ పాటిద్కర్ లాంటి యువ ఆటగాడికి జట్టు నాయకత్వం అప్పగించారు. గత సిజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తప్పితే పెద్ద స్టార్ ఎట్రాక్షన్ కూడా లేదు. విరాట్, భువి, లివింగ్ స్టన్, సాల్ట్, టిమ్ డేవిడ్ కీలక ప్లేయర్స్ గా వున్నారు.
ఆర్సిబీ జట్టు బౌలింగ్ బలహీనంగా వుంటుంది. ఈసారి పెద్దగా ఫాం లోని భువి బౌలింగ్ బాధ్యత తీసున్నాడు. భువితో పాటు హెజిల్ వుడ్, ఎంగిడి కూడా వున్నారు. అలాగే ఈ జట్టు సమన్వయంలో కూడా చాలా లోపాలు వుంటాయి. ఈసారి కొత్త కుర్రాడు రజత్ కి నాయకత్వ పగ్గాలు ఇచ్చారు. చెన్నై కి రుతురాజ్, ధోని కాంబినేషన్ లా, ఆర్సీబీ కి రజత్, విరాట్ కలసి జట్టుని నడిపించే అవకాశం వుంది. ఈ సీజన్ ఆర్సీబీ అంత ఈజీగా కనిపించనప్పటికీ ఎదో మ్యాజిక్ జరిగి విరాట్ ఐపీఎల్ టైటిల్ ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.