న్యాయవ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని తన కబ్జాలకు అండగా కోర్టు ఆర్డర్ పొందాలనుకున్న వ్యక్తికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించింది. ఓ వ్యక్తి గతంలో హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తమ భూములు ప్రభుత్వ భూములు అంటున్నారని ఆ భూములు తనవేనని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది. అది విచారణకు రావడం లేదని.. మరో బెంచ్ ముందుకు వచ్చేలా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో అతను కోర్టుతో గేమ్స్ ఆడుతున్న విషయం కోర్టుకు అర్థమైంది. ఆల్రెడీ ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఇప్పుడు మరో పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటని కోర్టును తప్పుదోవ పట్టించి భూములను కబ్జా చేసే ప్రయత్నమేనని కోర్టు గుర్తించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లువేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేసిందది. కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
భూముల వ్యవహారాల్లో న్యాయస్తానాలను అడ్డం పెట్టుకుని .. పలువురు వివిధ రకాల ఆర్డర్స్ తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ పిటిషన్ విషయం బయటపడటం.. హైకోర్టు గుర్తించడం సంచలనంగా మారింది.