ఇటివలే నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యింది. సోషల్ మీడియాలో ఇదే రచ్చ నడిచింది. విజయ్ దేవరకొండ, నాని ఇద్దరూ యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకొని స్టార్స్ గా ఎదిగారు. విజయ్ దేవరకొండకు “అర్జున్ రెడ్డి”తో క్రేజ్ వచ్చింది. నాని “జెర్సీ, “దసరా” వంటి పాన్-ఇండియా సినిమాలతో అలరించారు. నాని ‘హిట్ 3’ టీజర్, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ టీజర్స్ రిలీజ్ అవ్వగానే ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యింది. నీ హీరో గొప్పా? నా హీరో గొప్పా? ఎవరు స్టార్ హీరో? ఎవరు సెల్ఫ్ మేడ్? అంటూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రీల్ ట్రెండ్స్ ద్వారా ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది.
ఇలాంటి సమయంలో ఈ ఇద్దరూ నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ రిలీజ్ కు సిద్ధమైయింది. ఈ రోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నాని, విజయ్ ఫ్యాన్ వార్ ప్రశ్న ఎదురైయింది. ‘నాకు ఫ్యాన్ వార్ గురించి తెలీదు కానీ నాని, విజయ్ కి చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా వుంటారు, సీన్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుకొని సినిమా బెటర్మెంట్ కోసం చాలా పాషన్ తో పని చేశారు. నా ఫస్ట్ సినిమా అలాంటి పాషన్ వున్న నటులతో చేయడం లక్కీ’అని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీరిలీజ్ అవుతుంది.