వైఎస్ఆర్ పేర్లకు సంబంధించి ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ స్పందించలేదు కానీ.. షర్మిల స్పందించారు. జగన్ మీద కోపం వైఎస్ఆర్ మీద చూపిస్తున్నారని విమర్శించారు. డు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారన్నారు అధికారంలో ఉండగా స్వర్గీయ NTR పేరు మార్చి YCP ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత YSR పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటోందని విమర్శించారు.
సోమవారం జరిగిన కేబినెట్ వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. YSR జిల్లాను తిరిగి YSR కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేదన్న షర్మిల.. మరి ఎన్టీఆర్ జిల్లా పేరుతో ఎన్టీఆర్ విజయవాడ అనో లేక పాత ఎన్టీఆర్ కృష్ణ జిల్లా అని ఎందుకు పెట్టుకోలేదని షర్మిల ప్రశ్నించారు. అలాగే తాటిగడపకు వైఎస్ఆర్ పేరు తీసేయడాన్ని ఖండించారు.
వైఎస్ఆర్ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదని హితవు పలికారు. వైఎస్ విషయంలో వైసీపీ ఈ మాత్రం స్పందన కూడా వ్యక్తం చేయలేదు.