* ”గడపగడపకూ వైఎస్ఆర్ సిపి”
* ప్రతిపక్ష వ్యూహం లోతు గుర్తించిన తెలుగుదేశం
నాయకుల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ప్రజసమస్యలపై ఉద్యమింపజేసే విధంగా ఎట్టకేలకు ”గడపడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమాన్ని జగన్ రూపొందించారు. ఇందులో ఆయన సఫలమౌతారో విఫలమౌతారో ఇప్పటికిప్పుడే తెలియదు. అయితే, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి, గ్రామగ్రామానా పార్టీ నిర్మాణానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదే!
”గడపగడపకూ వైఎస్ఆర్ సిపి” కార్యక్రమంలో ”లోతు” గుర్తించడం వల్లే దీన్ని ఎప్పటికప్పుడు ఏ ఊరికి ఆఊరిలోనే న్యూట్రల్ చేసే కౌంటర్ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం రూపొందిస్తోంది.
జగన్ ఇప్పటికే చాలా ఆందోళనలు చేపట్టారు. రైతుల కోసం, విద్యార్దుల కోసం యువభేరిలు నిర్వహించారు. పలు సందర్భాలలో నిరాహారదీక్ష లు చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం కూడా నిరసన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమాలన్ని ప్రజలలో అనుకున్నంతగా స్పందనలు రాబట్టలేకపోయాయి.
ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షనేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన దీక్ష చేపడు తుంటే.. ఆ పార్టీ ఎంఎల్ఏలు, ఎంపిలు, నియోజకవర్గ ఇన్చార్జీలు దీక్షా శిభిరం చుట్టు ప్రదక్షణలు చేశారు. జగన్మోహన్రెడ్డిని కలిసి తమ మద్దతు ప్రకటించారు తప్ప.. ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఉన్న ప్రాధాన్యతను, తమ నాయకుడు దీక్ష పట్టుదలను ఆపార్టీ నాయకులే సిరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకహోదా కోసం జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షకు కమ్యూనిస్టు పార్టీలు ఎంఆర్పిఎస్, ఉద్యమ సంఘాలు,పలు ప్రజాసంఘాలు, విద్యార్ది సంఘాలు మద్దతు ప్రకటించాయి.
అయితే ప్రజా సంఘాలు, ఇతర పార్టీల మద్దతులు కలుపుకొని ప్రత్యేక హోదా విషయమై జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్రాన్ని స్దంభింపజేయాలన్నది జగన్మోహన్రెడ్డి ప్రణాళిక. కాని ఈ విషయం లో పార్టీ శ్రేణులు పూర్తిగా విఫలమయ్యాయి.
ఓదార్పు యాత్ర, వేర్వేరు అంశాలపై నిరాహారదీక్షలు, రోడ్ షోలు, ఆందోళనలు, ఉద్యమాలు, పారాటాలు…పేరు ఏదైనా కూడా అందులో జరిగేది చంద్రబాబు నాయుడు ని జగన్ దుమ్మెత్తిపోయడం తప్ప మరే విషయమూ వుండదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శంచడం ప్రతిపక్షనాయకుడిగా జగన్ బాధ్యతే! అంతకు మించి ప్రజల్లోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఇందుకు ఆయన తండ్రి ఎంచుకుని అధికారంలోకి వచ్చిన మార్గం ”పాదయాత్ర”. ఆతరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక ముఖ్య కారణం కూడా ”పాదయాత్రే”.
వైఎస్ఆర్ సిపి అంటే జగన్ మాత్రమే అన్నభావనతో నాయకులు కార్యకర్తలు నిర్తిప్తతలో కూరుకుపోతున్న పరిస్ధితి ఆపార్టీ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలతో తెలుగుదేశంలో కలిపేసుకోడానికి చంద్రబాబుకి బాగా సహకరించింది. ”జగన్ ఎవరి మాటా వినడు ఎవరైనా ఆయన మాటే వినాలి” అన్న సిట్యుయేషన్ మైండ్ గేమ్ ద్వారా ఆయన పార్టీ నాయకుల్లో తెలుగుదేశం నింపి, వారిలో నిరాశను ప్రవేశపెట్టే దారులు కూడా ”అటునుంచి ఇటువచ్చిన” ఎమ్మెల్యేలద్వారా తెరుచకున్నాయి.
ఇదంతా విశ్లేషించుకున్నాక అధినేత ఒక్కడే పోరాడితే సరిపోదని గ్రామ స్థాయి నుండి ప్రజా మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలన్నా నిర్ణయం ఆ పార్టీ తీసుకొంది. పార్టీలో సీనియర్ల మాట వినడమే జగన్ లో వచ్చిన పెద్దమార్పు అని ఆపార్టీ వారే అంటున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షంలేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నంపై జగన్ పోరాటమో…పార్టీని గ్రామస్దాయిలో బలపరిచి స్దిరత్వాన్ని సాధించాలన్నా ఆరాటామో…గాని ”గడపగడపకూ వైఎస్ఆర్ సిపి” కార్యక్రమం రూపొందింది. రాజశేఖరరెడ్డి జయంతి నాటి నుంచి డిసెంబరు 31 వరకూ 5 నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగితే అది ఉద్యమస్ధాయికి చేరుకుంటుంది. ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలోను సరాసరి 50వేల కుటుంబాలు ఉంటాయని అంచనా వేసి 5 నెలల కాలంలో ప్రతి కుటుంబాన్ని ఆయా గ్రామ, మండల, నియోజకవర్గస్దాయి నాయకులు తప్పకుండా ప్రజలను కలిసేలా ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.
ప్రతి ఇంటికి పార్టీ నేతలు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లపాలన, ఆయన అవినీతిపై పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేయాలని జగన్ నాయకులకు సూచించారు. కరపత్రంలో చంద్రబాబు పాలనలో పాసైయ్యాడా? పెయిల్ అయ్యాడా? అని ప్రజలను కోరుతూ వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు ఇచ్చి వారి అభిప్రాయాన్ని కోరనున్నారు.