బందరు పోర్టుకు లక్ష ఎకరాలకు పైగా భూ సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అన్ని పత్రికల మొదటి ఎడిషన్లలో ఆ శీర్షికే వచ్చింది. రాత్రి 10.30 తర్వాత ఆ సమాచారం పొరబాటనీ కేవలం 22 వేల ఎకరాలే సమీకరణ చేస్తామని సవరణ తెలియజేశారు. దాంతో వార్త మారింది. ఇక్కడ రెండు ప్రశ్నలు. మొదటిది నిజంగా స్పష్గత ఇచ్చివుంటే మంత్రి గారు అంత తెప్పు చెబుతారా? రెండవది- మొదట అనుకున్నది మార్చుకుని తర్వాత సవరణ చేశారా? రాష్ట్రంలో విపరీతంగా సాగుతున్న భూ సేకరణ సమీకరణల నేపత్యంలో లక్ష ఎకరాలు అన్నా ఎవరూ ఆశ్చర్యపోరు. కాని అమరావతి తరహాలో సమీకరణ అన్నిచోట్లా అమలు చేయడం అవసరమా న్యాయమా అన్న ప్రశ్న వస్తుంది. రాజధాని ప్రాంతంలో వలె ఇతర చోట్ల భూముల విలువ పెరిగేది కూడా వుండదు. పైగా దేశంలోని పార్టీలన్నీ కలసి అత్యున్నత సభలో 2013 భూ సేకరణ బిల్లు ఆమోదించిన తర్వాత ఇంత తేలిగ్గా దాన్ని పక్కనపెట్టేట్టయితే ఇక ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా వస్తున్నది.