నితిన్ ‘రాబిన్హుడ్’ ట్రైలర్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ లో ఈ కథ గురించి పెద్దగా హింట్ ఇవ్వలేదు. ట్రైలర్ లో మాత్రం ఓ పాయింట్ ని రివిల్ చేశారు. వెరైటీ దొంగతనాలు చేసే రామ్ అలియాస్ రాబిన్ హుడ్ కి ఓ లక్ష్యం వుంటుంది. ఓ ముఠా ఓ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని నిషేధిత డ్రగ్స్ ని హార్వెస్ట్ చేస్తుంటుంది. ఆ ముఠాని అంతం చేయాలనేది రాబిన్ వుడ్ టార్గెట్.
వెంకీ కుడుములకి ఓ స్టయిల్ వుంది. తను ఎంచుకున్న పాయింట్ కి షుగర్ కోటింగ్ వేసి చెబుతుంటాడు. ‘ఛలో’ లో రెండు ప్రాంతాలు, భీష్మలో అర్గానిక్ ఫార్మ్ పాయింట్లని సరదాగా సాగించి చివర్లో ఎమోషనల్ ఇంపాక్ట్ తో ముగిస్తాడు. రాబిన్ వుడ్ లో కూడా ఆ టచ్ కనిపించింది.
ట్రైలర్ సరదాగా ఫన్నీ జోకులు, సీన్లపై నడిచి తర్వాత యాక్షన్ టర్న్ తీసుకుంది. నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, శ్రీలీల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమా వినోదంలో కీలకం. ట్రైలర్ లో కొన్ని జోకులు పేలాయి. పద్మశ్రీ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ కి పర్శనల్ గా కనెక్ట్ అవుతుంది.
అసలు కథ డ్రగ్ మాఫియా తెరపైకి వచ్చాక మొదలౌతుంది. ఇక్కడే రాబిన్ వుడ్ లో యాక్షన్ హీరో బయటకు వచ్చాడు. నితిన్ హుషారుగా కనిపించాడు. తన మారువేషాలు గమ్మత్తుగా వున్నాయి. ‘కరోనా క్వారంటైన్ 14 రోజులే. నేనొస్తే లైఫ్ లాంగ్’ డైలాగ్ హీరోయిజం ఎలివేషన్ కి వాడారు. శ్రీలీల మరోసారి గ్లామర్ తో ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఓల్డ్ ఏజ్ ఏజెన్సీ చుట్టూ కొంత ఫన్ వుంది. బీజీఎం కెమరా వర్క్ డీసెంట్ గా వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ లావిష్ గానే తీశారు. అన్నట్టు ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో కొసమెరుపు ఆయనే. మార్చి 28న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.