వైసీపీ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలతో జగన్మోహన్ రెడ్డి షెడ్డుకెళ్లారు. ఇప్పుడు ఆయన సలహాలతో చాలా మంది నేతలు కూడా ఇంకా ఇంకా సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు. ఈ విషయంలో విడదల రజని మరింతగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వర్గాలు జాలి చూపిస్తున్నాయి. ఆయన సలహాలతోనే టీడీపీ నేతలపై రివర్స్ ఆరోపణలు చేసి కేసుల నుంచి బయటపడవచ్చని అనుకుంటున్నారని కానీ ఆమె చేస్తున్న ప్రకటనలతో .. మరింత క్లిష్టం చేసుకుంటున్నారని అంటున్నారు.
విడదల రజని దోపిడీ బహిరంగం !
సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చానని తనకు డబ్బులు అవసరం లేదన్నట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో రజని చెప్పేవారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ఎంత కక్కుర్తిగా వ్యవహరించారో చిలకలూరిపేట జనం చూశారు. పేటలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వారిని కూడా వదల్లేదు. ఆ బాధ డబ్బులు ఇచ్చిన వారికి.. అనుభవించిన వారికి తెలుస్తుంది. ఇక స్టోన్ క్రషర్లు .. లాంటి వారిని అయితే దోపిడీ చేసి వదిలి పెట్టారు. అధికారం పోయాక కేసుల భయంతో చాలా మందికి డబ్బులు వెనక్కి ఇచ్చారు. అయితే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
పదవులు, కాంట్రాక్టుల పేర్లతో కోట్లు వసూలు
విడదల రజని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్తూ.. మల్లెల రాజేష్ నాయుడు అనే అతనికి టిక్కెట్ ఖరారు చేయించారు. ఎందుకంటే ఆయన వద్ద ఆరున్నర కోట్లు వసూలు చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయనను తప్పించారు. ఆయన అప్పట్లోనే రజనీపై ఆరోపణలు చేశారు. అలాంటి వారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు. అందరి దగ్గరా కోట్లు , లక్షలు వసూలు చేశారు. ఇదంతా పేటలో బహిరంగంగా ప్రజలకు తెలిసిన విషయం.
పరువు పోగొట్టుకునేలా ఆరోపణలు
తనకు పరువు ఉందని అందుకే అప్పట్లో తాను కొన్ని విషయాలు చెప్పలేదని కృష్ణదేవరాయులు మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసుకునే ప్రయత్నం చేశారని..తమ కుటుంబంలో చొరబడే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి మరి ఇప్పుడు పరువు లేదా అన్న ప్రశ్నలు కృష్ణదేవరాయులు మద్దతు దారుల నుంచి వస్తున్నాయి. చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడటానికి ఇలాంటి ఆరోపణలు చేయమని చచ్చు సలహాలు ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డేనని.. వైసీపీ నేతలకూ స్పష్టత వచ్చింది.
పోయిన పరువు చాలదా ?
విడదల రజనీ వైసీపీలో మంత్రి అయ్యారు. తొలి సారే ఆ అవకాశం వచ్చింది. కానీ అది ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏం జరిగిందో అర్థం చేసుకుని తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేయకుండా వైసీపీ కోసం బలయ్యేందుకు వారికి సహకరిస్తున్నారు. ఇదే అసలు ఆమెకు పెను ప్రమాదంగా గుర్తించలేకపోతున్నారు.