హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు తీసుకు వస్తుందని భావిస్తున్న లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మందకొడిగా సాగుతోంది. గతంలో అప్లయ్ చేసుకున్న వాళ్లకి మిగతా ఫీజు కడితే రెగ్యులరైజ్ చేసే సరిపోయేది కానీ.. కొత్తగా అనేక నిబంధనలు పెట్టడం.. ఎన్వోసీలు తెచ్చుకోవాల్సిన రావడంతో ఏది అయితే అది అయిందని.. చాలా మంది సైలెంటుగా ఉండిపోతున్నారు. ఫలితంగా అనుకున్నంతగా ఫీజులు కట్టేవారు లేరు.
కొంత మంది ఫీజు కట్టేందుకు సిద్ధమవుతున్నాయి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం చెబుతున్న విధంగా 2020 లో మనం దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రెండు విధాలుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తోంది. కాకపోతే ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఒక లేఔట్ లోని ఒకే సర్వే నెంబర్ లో ఉన్న వేరు వేరు దరఖాస్తుదారులకు వేర్వేరుగా ఎల్ఆర్ఎస్ ఫీజు కనపడుతోంది. దీనికి కారణమేంటన్నది టౌన్ ప్లానింగ్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెప్పలేకపోతున్నారు.
ఆఫీసర్ స్థాయిలో ఎన్వోసీ కావాల్సి వస్తూండటంతో వారి చుట్టూ తిరగలేక… చాలా మంది సైలెంటుగా గా ఉంటున్నారు. ఓ లేఔట్లు లో కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయిస్తే.. మిగిలిన ప్లాట్లకు తర్వాత అయినా తప్పనసరిగా ఎల్ఆర్ఎస్ చేస్తారని దానికి గడువేమీ ఉండదని మరికొంత మంది అంటున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మరింత సులువు చేసి ఉంటే ప్రభుత్వం ఆశించినన్ని నిధులు వచ్చేవని అంటున్నారు.