హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఓఆర్ఆర్ ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఓ కల్పతరువులా మారింది. నగరం వేగంగా విస్తరించడంతో అనేక గ్రామాలు సిటీలుగా మారుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రావిర్యాల. రావిర్యాల చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, ప్లాట్ లేఔట్లు కనిపిస్తూంటాయి. ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, శ్రీశైలం హైవే సమీపంలో ఉండటం వల్ల కనెక్టివిటీ సమస్య లేదు.
ఐటీ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూసే వారు ఈ ప్రాంతంలో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులపైనే ఎక్కువగా రావిర్యాల ప్రాంతంలో చేపడుతున్నారు. రావిర్యాలలో రియల్ ఎస్టేట్ విలువ రాబోయే 5-10 సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రావిర్యాలలో చిన్న బిల్డర్లు అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల మధ్యలో ఇవి లభిస్తున్నాయి. 3 BHK విల్లాల ధరలు రూ. కోటి నుండి రూ. 1.5 కోట్ల వరకు చెబుతున్నారు. రావిర్యాలలో ప్లాట్ ధరలు స్థానం, రోడ్డు కనెక్టివిటీని బట్టి ఒక చదరపు గజం ధర సాధారణంగా రూ. 15,000 నుండి రూ. 25,000 మధ్య ఉంది. 200 చదరపు గజాల ప్లాట్ అయితే రూ. 30 లక్షల నుండి రూ. 50 లక్షల కు అమ్ముతున్నారు.
రావిర్యాలలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి, ఇళ్ల ధరలు రూ. 40 లక్షల నుండి రూ. 1.5 కోట్ల వరకు స్థలాల ధరలు చదరపు గజానికి రూ. 15,000–రూ. 25,000 మధ్య ఉన్నాయి. ఈ ప్రాంతం దీర్ఘకాలిక పెట్టుబడికి మంచి రిటర్నుల ఇచ్చే అవకాశం ఉంది.