ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చోసుకున్నట్లే తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో సిస్కో టీమ్‌తో రేవంత్ చర్చలు జరిపారు. ఆయన సమక్షంలో అధికారులు సంతకాలు చేసుకున్నారు. అయితే సిస్కో ఉన్నత ఉద్యోగి అయిన ఇప్పాల రవీంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం వెల్లడి కావడంతో ఆయనను సీఎం రేవంత్ తో కలిసే టీం నుంచి డ్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ సోషల్ మీడియా సైకోల్లో మొదటి రకం అయిన ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తి ఏపీ ప్రభుత్వంతో సిస్కో కంపెనీ చేసుకున్న ఒప్పందం సమయంలో హాజరయ్యారు. లోకేష్ తో కలిసి ఫోటోలు దిగారు. ఆయనే ఇప్పాల రవీంద్ర అని వీడియోలు రిలీజ్ అయ్యే వరకూ ఎవరికీ తెలియదు. తెలిసిన తర్వాత గగ్గోలు రేగింది. చివరికి నారా లోకేష్ కూడా షాక్‌కు గరయ్యారు. సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత చీప్ గా సోషల్ మీడియా పోస్టులు పెడతారా అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన గురించి సిస్కో టీమ్ కు సమాచారం ఇచ్చారు. మరోసారి ఎపీకి సంబందించిన ఎలాంటి విషయాల్లోనూ ఆయనను ఇన్వాల్వ్ చేయవద్దని స్పష్టం చేశారు.
ఇప్పాల రవీంద్రారెడ్డి సిస్కోలో ఉన్నత స్థానానికి వెల్లేందుకు చాలా విషయాలను కంపెనీ వద్ద దాచి పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. 2017లోనే ఆయన సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయ్యారు. ఇలాంటి కేసులు, అరెస్టులు రికార్డు ఉన్నవారికి సిస్కో లాంటి కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వవు. ఆయన కీలక విషయాలను దాచిపెట్టి సిస్కోలో చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన వ్యవహారంపై కంపెనీ యాజమాన్యం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పాల ఉద్యోగం ఊడిందా?
సిస్కో టీం మంగళవారం లోకేష్‌ను కలిసినట్లే బుధవారం తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. కొన్ని శిక్షణ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకున్నారు.
అయితే దక్షిణాది రాష్ట్రాల వరకూ సిస్కోకు అకౌంట్ మేనేజర్ గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా సైకోగా గుర్తింపు పొందిన ఇప్పాల… pic.twitter.com/6XDJZ4Jgud
— Telugu360 (@Telugu360) March 26, 2025