రేపు (మార్చి 27న) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్ అయితే కట్ చేశారు. అయితే దానికి సంబంధించిన ఆర్.ఆర్ పూర్తవుతోంది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసి హడావుడిగా విడుదల చేయడం ఎందుకు, కాస్త ఆగుదాం అని మైత్రీ మూవీస్ ఆలోచిస్తోంది.
చరణ్ పుట్టిన రోజున పోస్టర్ విడుదల చేసి, ఉగాదిన టీజర్‌ని వదిలితే బాగుంటుందన్నది లేటెస్ట్ ఆలోచన. గ్లింప్స్ అయితే నెక్ట్స్ లెవల్ లో వచ్చిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మాత రవి కూడా అదే చెబుతున్నారు. ‘ఒక్క షాట్ కోసం 1000 సార్లు చూస్తారు’ అంటూ ఆయన హైప్ అమాంతంగా పెంచేశారు.
ఈ సినిమా కోసం ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గ్లింప్స్‌తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారు. అంతేకాదు.. రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు. 2026 మార్చి 28న సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.