నాయకుడు సకాలంలో స్పందించి అందించే సాయం వెలకట్టలేనిది. సవాలక్ష పనులతో బిజీగా ఉండే నాయకుడు అతి ముఖ్యమైన మెసెజ్‌లకు సరైన సమయంలో స్పందిస్తే ప్రాణాలు కూడా నిలబడతాయి. నారా లోకేష్ స్పందన ఈ విషయాన్ని మరోసారి నిజం చేసింది.
గుంటూరు రమేష్ ఆస్పత్రిలో ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయింది. ఆ యువతి తల్లిదండ్రులు ఆర్గాన్ డొనేషన్ చేసేందుకు అంగీకరించారు. దాంతో ఆర్గాన్ ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్న వారి జాబితాను రమేష్ ఆస్పత్రి పరిశీలించి వివిధ ఆస్పత్రులకు వాటిని పంపే ఏర్పాట్లు చేసింది. తద్వారా బ్రెయిన్ డెడ్ అయిన యువతి నలుగురు, ఐదుగురికి ప్రాణదానం చేసింది. కానీ గుండె తరలింపు విషయంలో మాత్రం సమస్య వచ్చింది. గుండె మార్పిడి ఆపరేషన్ కు సిద్ధంగా ఉన్న వ్యక్తి తిరుపతిలో ఉన్నారు. ఆర్గాన్ ను గుంటూరు నుంచి తిరుపతి తరలించాలంటే గంటలు పడుతుంది. అంత సమయం ఆర్గాన్ ను లైవ్ గా ఉంచలేరు. అదే సమయంలో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తరలించడానికి విమానాలు కూడా అందుబాటులో లేవు.
ఈ అంశంపై సహకరించాలని రమేష్ ఆస్పత్రి సిబ్బంది నారా లోకేష్‌కు మెసెజ్ పెట్టారు. ఈ మెసెజ్ అందిన నిమిషాల్లోనే నారా లోకేష్ తన సొంత డబ్బుతో విజయవాడ ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసేలా అధికారులతో మాట్లాడారు. ఇంత వేగంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణం నిలుపడం .. మనసున్న నాయకుడి లక్షణమని.. ఆర్గాన్ డొనేషన్ చేస్తున్న .. తీసుకుంటున్న కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.