ఇటీవలి కాలంలో ఎప్పుడూ రానంత అతి పెద్ద భూకంపం ఆగ్నేయాసియా దేశాల్లో వచ్చింది. 7.7 శాతం మేర భూకంప తీవ్రత నమోదు కావడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. మయన్మార్లో భూకంప కేంద్రం ఉంది. రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం వచ్చినట్లుగా నిపుణులు వెల్లడించారు. ఈ భూకంపం విలయం సృష్టించింది. కొన్ని వేల భవనాలు నేలమట్టమయ్యాయి. మయన్మార్, థాయల్యాండ్లో ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ.
హఠాత్తుగా కూలిపోయిన భవనాలు, ఊగిపోయిన బహుళ అంతస్తుల భవనాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాథమికంగా యాభై మంది వరకూ చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే అసలు ప్రమాద తీవ్ర ఏ స్థాయిలో ఉదో అంచనా వేయడం కష్టంగా ఉండటంతో మృతుల సంఖ్య ఊహించనంతగా ఉంటుందని భావిస్తున్నారు. మయన్మార్ లో ఎక్కువగా భూకంప ప్రభావం ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ధాయ్ ల్యాండ్ లో కూడా భూకంప తీవ్రత ఎక్కువగానే ఉంది.
బ్యాంకాక్ ప్రజలు రోడ్లపై పరుగులు పెట్టారు. అక్కడ కూడా పలు భవనాలు కూలిపోయాయని రిపోర్టులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏ దేశంలో 7 శాతం తీవ్రతతో భూకంపాలు రాలేదు. ఇప్పుడు 7.7 శాతం తీవ్రతతో రావడం ఊహించని. ఐదు శాతం లోపు తీవ్ర రిక్టర్ స్కేల్ పై కనిపిస్తే దాని వల్ల స్వల్ప ప్రభావమే ఉంటుది. ఆతర్వతా తీవ్రత పెరుగుతుంది. ఏడు శాతం కన్నా ఎక్కువ ఉంటే అతి విధ్వంసకర భూకంపమే అనుకోవచ్చు.
మయన్మార్, బంగ్లాదేశ్ లను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నాయి. భారత ప్రధాని కూడా మయన్మార్ కు అండగా ఉంటామని ట్వీట్ చేశారు.