ఇప్పుడు ధనవంతులు కోరుకునేది లగ్జరీనే. తమ స్థాయికి తగ్గ లగ్జరీని కోరుకుంటున్నారు. లగ్జరీ, సౌకర్యాలకు డిఫైనేషన్ లేదు. ఎంత ఖర్చు భరించగలిగితే.. ఎంత సౌకర్యం వస్తుంది. ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత లగ్జరీ ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఉన్న “ డీఎస్ఆర్ ద ట్విన్స్”.
ఈ ప్రాజెక్టు పుప్పలగూడలో ఉంది.మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మూడు ఎకరాల్లో రెండు టవర్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి టవర్‌లో 43 అంతస్తులు ఉంటాయి. మొత్తం 85 అపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ 15,999 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది, ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కో అంతస్తులో ఒకే అపార్ట్మెంట్ ఉండటం ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ.
ఈ ప్రాజెక్టులో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ క్లబ్‌హౌస్ ఉంది, ఇందులో కాన్ఫరెన్స్ రూమ్, స్నూకర్, బిలియర్డ్స్ రూమ్‌లు, సాకర్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, ఇన్ఫినిటీ పూల్, పిల్లల కోసం ప్రత్యేక పూల్, జిమ్, కేఫెటీరియా, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ విషయంలో ఇంకా చాలా అపార్టుమెంట్లు ఉన్నప్పటికీ.. సైజు , ప్రత్యేకతల ఆధారంగా “DSR The Twins” నెంబర్ వన్ అనుకోవచ్చు. ఇక్కడ ధర ఎంతో మనం ఊహించలేం.. తెలుసుకుని అమ్మో అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఎందుకంటే సామాన్యుడు ఊహించనంత ఎక్కువ రేటు అక్కడ ఉంటుంది.