ప్రభాస్ కోసం వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది. బాహుబలి 2 పూర్తి చేసి వచ్చిన వెంటనే ఎగరేసుకుపోవడానికి దర్శకులు, నిర్మాతలు రెడీగా ఉన్నారు. ప్రభాస్ కూడా బాహుబలి 2 తరవాత తన కెరీర్ ఎలా ఉండాలో.. జాగ్రత్తగానే ప్లాన్ చేసుకొంటున్నాడు. ఇప్పటికే సుజిత్ చెప్పిన కథకు ఓకే చెప్పేశాడు ప్రభాస్. ఇప్పుడు మరో దర్శకుడ్ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. జిల్‌తో ఎంట్రీ ఇచ్చాడు.. రాధాకృష్ణ. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా, రాధా కృష్ణలో టాలెంట్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు రాధ.. ప్రభాస్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడని తెలుస్తోంది. దాన్ని కూడా యువీ క్రియేషన్స్ లోనే తెరకెక్కించనున్నట్టు సమాచారం. సుజిత్ సినిమా అవ్వగానే.. జిల్ దర్శకుడితో జట్టు కట్టడానికి ప్రభాస్ రెడీ అయ్యాడని టాక్.
బాహుబలి లాంటి సన్సేషనల్ హిట్టు తరవాత… ఎవరైనా సరే, స్టార్ దర్శకులతో చేయాలనుకొంటారు. కానీ ప్రభాస్ మాత్రం రూటు మార్చి, కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ప్రభాస్ గేమ్ ప్లాన్ ఏంటో… కొత్త వారికే వరుసగా అవకాశాలెందుకు ఇస్తున్నాడో.. ప్రభాస్‌కే తెలియాలి.