హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా చివరి రోజు గౌతమ్ రావును ప్రకటించారు. శుక్రవారమే నామినేషన్లకు చివరి రోజు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. మజ్లిస్ కు ఆ పార్టీ మద్దతివ్వనుంది. బీఆర్ఎస్ కు సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో కార్పొరేటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు. ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 14ఓట్లు ఉన్నాయి. వారు సపోర్టు చేయనున్నరాు. ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయమని అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ .. బీజేపీకి మద్దతుగా ఓటేస్తే మాత్రం ఆ పార్టీకే విజయం ఖాయమవుతుంది. కానీ అలా చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లుగాకనిపిస్తోంది.
నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 9 వరకు అవకాశముంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియలను నిర్వహించనున్నారు. కార్పొరేటర్లు చాలా మంది పార్టీలు మారిపోతున్నారు. బీఆర్ఎస్ ను వీడి చాలా మంది కాంగ్రెస్ లో చేరారు కానీ.. బీజేపీలో చేరింది తక్కువ. అయితే బీజేపీ అభ్యర్థి ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన వర్గం కార్పొరేటర్లతో వ్యతిరేకంగా ఓటేయిస్తే..బీజేపీకి మరింత గడ్డు కాలం ఎదురవుతుంది.