భారీ అంచనాలతో ఐపీఎల్ సీజన్ 18 ని మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ అంచనాల్ని తలకిందులు చేసింది. తొలి మ్యాచ్ లో విజయం సాధించి రేసుని ఘనంగా ప్రారంభించిన ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలై సెమీస్ రేసు నుంచి క్రమంగా కిందకు జారిపోయింది. ఇప్పుడు పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో వుంది.
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తుచేసింది. సిరాజ్ బౌలింగ్ దెబ్బకు మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. అనంతరం గుజరాత్ మరో 20 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టిలో అట్టడుగున చేరింది సన్‌రైజర్స్.
ఇప్పటికే సీజన్ లో పావు వంతు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు సన్‌రైజర్స్ పైకి రావాలంటే ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్టుగా వుంటుంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. మొదట్లో డేంజర్ ప్లేయర్లుగా కనిపించిన హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసన్ సడన్ ఫాం కోల్పోయినట్లు అడుతున్నారు. అటు బౌలింగ్ లో కమిన్స్ తప్పితే మరో బౌలర్ ఎఫెక్టివ్ గా కనిపించం లేదు. నాణ్యమైన స్పిన్నరే కనిపించడం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో ఆ జట్టు మెరుగవ్వాలి. ఇదే ఫామ్ లో ఆడితే మాత్రం కప్పు కాదు కదా, కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరలేరు. ఇంత మంచి టీమ్ పెట్టుకొని, ఇంత మంది స్టార్ బ్యాటర్లని ఎంచుకొని ప్లే ఆఫ్‌కి కూడా క్వాలిఫై అవ్వకపోతే అంతకంటే మరో అవమానం ఉండదు. ఇప్పటికైనా సన్‌రైజర్స్ మేలు కోవాలి. వీర ఊపుడు ఆపేసి, క్లాస్ ఆటపై ధ్యా స పెట్టాలి.