అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగులో ప్రమోషన్స్ లేవు. మరో రెండు రోజుల్లోనే సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రమోషన్స్ ఎంతమాత్రం జరిగాయో. ఇక ట్రైలర్ విషయానికి వస్తే అజిత్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. ప్రతి షాట్ హీరోయిజం, అజిత్ స్వాగ్ ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్లారు. కథ, కాన్ఫ్లిక్ట్ జోలికి పోలేదు. ఓ బాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో అన్నీ వదిలి మాణిక్యంలా జీవిస్తుంటాడు. మళ్ళీ తన కొడుకు కోసం అన్నీ పట్టుకుంటాడు. ఇదే సింపుల్ గా లైన్.
అజిత్ ఫ్యాన్స్ కి నచ్చేలా ట్రైలర్ కట్ వుంది. అజిత్ గెటప్స్ యాక్షన్ బావుంది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య హై ఎనర్జీతో వుంది. ఒక ఫైట్ కిక్ ని బీజీఎం వాడిన విధానం గమ్మత్తుగా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ తీసిన సినిమా ఇది. నిర్మాణంలో ఆ రిచ్ నెస్ కనిపించింది. ఈ సినిమాపై తెలుగులో పెద్ద బజ్ లేదు. ట్రైలర్ చూశాక ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని అర్ధమౌతుంది. మరి ఈ సినిమాని ఫ్యాన్స్ ఎంతలా మోస్తారో చూడాలి.