ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెంబర్ 2 అయిందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రిపోర్టుతో దేశవ్యాప్తంగా మరో సారి ఏపీ రైజింగ్ అవుతుందని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ వైసీపీ నేతలకు మాత్రం నచ్చడం లేదు. తాము చేసి పోయిన విధ్వంసానికి మరో పాతికేళ్లు అయినా ఏపీ నిలబడదని గట్టి నమ్మకంతో తెర ముందుకు వచ్చి .. అవన్నీ ఫేక్ అంటున్నారు.
లెక్కల్లో కాస్త సెన్సిబుల్ గా మాట్లాడే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించడం మావేశారు. దాంతో బొత్స సత్యనారాయణకు ఈ టాపిక్ మీద మాట్లాడాలని సజ్జల ఆఫీసు నుంచి సందేశం వెళ్లింది. ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. ఈ పది నెలల్లో అప్పులు చేశారని.. పనులేమీ చేయలేదని.. ఆదాయం పెరగలేదని.. ఎందుకు జీడీపీ పెరిగిందని ఆయన అంటున్నారు. ఆదాయం పెరగలేదని.. అప్పులు చేశారని ఆయన ఎ లెక్కలతో చెప్పారో మాత్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేకంగా ఉండే గణాంకాల శాఖనే అన్నీ లెక్కలు వేసి ఈ ..నెంబర్ 2 ర్యాంకును ఏపీకి ఇచ్చుకున్నారు.
బీజేపీ నేతలు.. కేంద్రం అలా ఫేక్ నెంబర్లు ఇచ్చే పని అయితే మొదటి స్థానం తమ రాష్ట్రానికే వేసుకుని ఉండకపోయేవారా.. ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చేవారా?. బొత్సకు తెలియని సబ్జెక్టుల మీద మాట్లాడాలని సమాచారం పంపుతున్నారు కానీ పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఆయనకు ఏపీ అభివృద్ది చెందడం ఇష్టం లేదని .. కేంద్రం లెక్కలు కూడా నమ్మేది లేదంటున్నారన్న విమర్శలు ఎుదర్కోవాల్సి వస్తుంది.
వైసీపీ విమర్శించాలన్న కారణంగా ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతోంది కానీ.. మా పాలనా ఫలితాలే అని చెప్పుకుని ఉంటే బాగుండేదని వైసీపీ నేతలు తమలో తాము గొణుక్కుంటున్నారు.