అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టిన రోజున అప్ డేట్ వస్తుందన్న లీక్ ముందే ఉంది. దానికి తగ్గట్టుగానే ఓ వీడియో వదిలింది చిత్రబృందం. అల్లు అర్జున్, అట్లీలు కలిసి ఏం చేయబోతున్నారన్నదానికి ఇదో శాంపింల్. అంతర్జాతీయంగా పేరు గాంచిన గ్రాఫిక్స్ స్టూడియోల్ని బన్నీ, అట్లీ ఇద్దరూ సందర్శించి, అక్కడి గ్రాఫిక్ నిపుణులకు కథ చెప్పడం, వాళ్ల రియాక్షన్స్కి క్యాప్చర్ చేయడం ఈ వీడియోలో కనిపించిన దృశ్యాలు. అవతార్ లాంటి సినిమాలకు పని చేసిన గ్రాఫిక్ సంస్థలు బన్నీ సినిమా కోసం వర్క్ చేయబోతున్నాయి. దాన్ని బట్టి… ఈసారి అట్లీ ఏ స్థాయిలో కథ రాసి ఉంటాడో ఊహించుకోవొచ్చు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సినిమా చేస్తున్నారు. అవతార్ సినిమా మొత్తం ఈ సాంకేతిక ఆధారంగా నిర్మించిన సినిమానే. మొత్తానికి అట్లీ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టు కనిపిస్తోంది. అట్లీ తీసిన సినిమాల్ననీ కమర్షియల్ గా ఆడేశాయి. అయితే ఎక్కడో శంకర్ని కాపీ కొట్టాడు, పాత సినిమాల వాసనే వస్తోంది.. అనే విమర్శలు వినిపించాయి. వాటన్నింటినీ దాటుకొని, ఈ సినిమా తీస్తున్నాడన్న నమ్మకం ఈ వీడియో కల్పించింది. బడ్జెట్ పరంగానూ లెక్కలు మారే అవకాశం ఉంది. కనీసం రూ.600 కోట్ల వ్యయం ఈ సినిమాకి అవసరం అవ్వబోతోందన్న ఇన్ సైడ్ వర్గాల టాక్. బన్నీ, అట్లీ ఇద్దరి పారితోషికమే దాదాపు 250 కోట్ల ఉంటుంది. కాబట్టి… ఇంత బడ్జెట్ అవ్వడంలో తప్పేం లేదు.