చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. సంక్రాంతికి రావాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఆలస్యమైంది. వేసవిలో వస్తుందనుకొన్నారు. మే 9న రిలీజ్ చేయాలనుకొన్నారు. కానీ ఇంకా ఆలస్యం అవుతోంది. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. అయితే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
విశ్వంభర చిత్రానికి సంబంధించి ఓ పాట బాలెన్స్ వుంది. అది కూడా ఐటెమ్ సాంగ్. ఈ పాట కీరవాణి ఎప్పుడో సిద్ధం చేశారు. అయితే.. షూట్ చేయలేదు. కారణం… ఈ ట్యూన్ చిరంజీవికి పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. అందుకే ఈ పాటని పక్కన పెట్టి, కొత్త ట్యూన్ తో కొత్త పాట సిద్ధం చేయమని చెప్పార్ట. కీరవాణి ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. కీరవాణి పాట ఇచ్చాక చిత్రీకరణ మొదలెడతారు. అయితే ఈ పాటలో నటించే కథానాయిక ఎవరన్నది తేలాల్సివుంది. దర్శకుడు వశిష్ట ప్రస్తుతం ఐటెమ్ గాళ్ ని వెదికి పట్టుకొనే పనిలో ఉన్నారు. పాటతో పాటు, అందులో నటించే నాయిక ఎవరో తేలిపోతే.. షూటింగ్ మొదలెడతారు. త్వరలోనే హనుమాన్ జంక్షన్ లో ఈ సినిమా నుంచి ఓ పాటని విడుదల చేయబోతున్నారని, అది హనుమాన్ కు సంబంధించిన పాట అని తెలుస్తోంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.