చిన్న బిడ్డకు అగ్నిప్రమాదంలో కాళ్లు, చేతులు కాలాయని తెలిస్తే ఏ తండ్రికి అయినా ఆ గాయాలేవో తనకే జరిగాయన్న ఆవేదనకు గురవుతారు. పవన్ కల్యాణ్ కూడా అలాంటి బాధలోనే ఉన్నారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయని తెలుసుకుని ఆయన తల్లిఢిల్లీపోతున్నారు. ప్రధాని మోదీ నుంచి అందరూ పలకరించి ధైర్యం చెప్పారు. సింగపూర్ లో వైద్య పరంగా ఎలాంటి సౌకర్యాలు కావాల్సిన వచ్చినా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రమాదం గురించి మీడియాకు తెలిపేందుకు పవన్ ఇంటి వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గట్టిగా మాట్లాడలేకపోయారు. జీరబోయిన గొంతుతో వివరాలు చెప్పారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింని.. నా కుమారుడు చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని చెప్పారన్నారు. అయితే
ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని పవన్ అన్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలిసిందని పవన్ తెలిపారు. ప్రస్తుతం బ్రాంకోస్కోప్ ట్రీట్ మెంట్ చేస్తున్నారని తెలిపారు. ప్రమాదంలో ఓ పసిబిడ్డ కూడా చనిపోయిందని తెలిసిందన్నారు.
ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారని.. సింగపూర్ హైకమిషనర్ కూడా సమాచారం అందించారని పవన్ తెలిపారు. అకీరా పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ బయులుదేరారు.
పవన్ కుమారుడికి స్కూల్లో జరిగిన ప్రమాదం గురించి తెలిసి అందరూ స్పందించారు. పవన్ కు ధైర్యం చెప్పారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని ఉన్నత స్థాయిలో భరోసా లభించింది. అయినా చిన్న బిడ్డకు జరిగిన ప్రమాదంపై పవన్ కలత చెందారు. విషాదవదనంతో ఉన్నారు.