మోహన్ బాబును ప్రశాంతంగా ఉండనిచ్చేందుకు కుమారులు ఇద్దరూ సిద్దంగా ఉన్నట్లుగా లేరు. కాస్త రోడ్డున పడకుండా ఉండి అందరూ మర్చిపోతున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో సోదరుడు మంచు విష్ణు పై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ కేసు పెట్టారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ..తన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఇంటి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో ఉన్నాయని.. నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని మనోజ్ ఆరోపించారు. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారని.. తన కుమార్తె బర్త్ డే వేడుకల కోసం తాను రాజస్థాన్ కి వెళ్లానని ఆ సమయం చూసుకుని విష్ణు ఇంట్లో విధ్వంసం చేశఆడన్నారు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ.. మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు.
మంచు సోదరులిద్దరి మధ్య గిల్లికజ్జాల స్థాయి నుంచి పెద్ద స్థాయి గొడవల వరకూ వెళ్లాయి. కుటుంబసభ్యులు ఒక్కో సారి ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో అనేక ఘటనలు నిరూపించాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోకుండా రోజూ ఏదో ఓ గొడవ పడటం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు.రేపు ఆవేశంలో ఏదైనా దారుణాలకు పాల్పడితే చింతించాల్సి వస్తుందని…. పరిష్కరించుకోవాలని పెద్దలు సలహాలు ఇస్తున్నా ఈ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.