రాజకీయాల్లో లాజిక్ గా మాట్లాడే వారు అరుదుగా ఉంటారు. అదే ఆ నేతలకు బలం. కొంతమంది మాత్రం లాజిక్ తో ప్రత్యర్థులను కొట్టాలని కిందమీదా పడి నవ్వుల పాలౌతుంటారు. జగన్ రాప్తాడు పర్యటన వేళ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కామెంట్స్ అచ్ఛం అలాగే ఉన్నాయి.
రామగిరి ఎస్సైపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సుధాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ లోకి తోపుదుర్తి ఎంటరయ్యారు. జగన్ పై వ్యాఖ్యలు చేసే స్థాయి సుధాకర్ కు లేదని స్థాయిలను నిర్దేశించారు. అయితే, మొదట ఈ విషయంలో రామగిరి ఎస్సైపై ఆరోపణలు చేసింది జగనే. అంటే జగన్ స్థాయి కూడా పరిమితమైనదేనని తోపుదుర్తి చెప్పకనే చెప్తున్నారన్నామట.
మరోవైపు… సుధాకర్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని అందుకే చంద్రబాబు మెప్పు కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని అనుకుంటున్నారని, కానీ ఆమె టికెట్ ఇప్పించే స్థాయిలో లేదన్నారు. ఆమెకు పార్టీలో ప్రాధాన్యత లేకపోతే తోపుదుర్తి, జగన్ , వైసీపీ మూకుమ్మడిగా సునీతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.
ఇలా… లాజిక్ లేకుండా మాట్లాడుతూ వైసీపీ నేతలు జనాల్లో మరింత పలుచన అవుతున్నారు.