మంచు మనోజ్ రోడ్డున పడ్డారు. తనను ఇంట్లో నుంచి గెంటేశారని.. కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన బుధవారం జల్ పల్లిలోని నివాసానికి వెళ్లారు. కానీ గేటు ముందే మోహన్ బాబు పేరుతో పెద్ద బోర్డు ఉంది. ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని బోర్డు పెట్టి తాళం వేసేశారు. దాంతో మనోజ్ లోపలికి వెళ్లలేక.. గేటు ముందే ధర్నా చేశారు.
ప్రధానంగా మనోజ్ .. విష్ణునే టార్గెట్ చేశాడు. తాను ఊళ్లో ఉన్నప్పుడు ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడని ఆరోపించారు. ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు రోడ్డు మీదకు తీసుకుని వచ్చి వదిలారని ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు. కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్న అని తనపై కోపం పెంచుకున్నారని ఆరోపించారు.
కూర్చుని మాట్లాడదాం అని అడుగుతున్నా.. విష్ణు ముందుకు రావడం లేదని మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు నుండి జల్పల్లి నివాసంలో ఉండటానికి తనకు ఆదేశాలు ఉన్నాయన్నారు. కుటుంబం నుండి ఒక రూపాయి తీసుకోలేదు. విష్ణు కెరియర్ కోసం అమ్మాయి గెటప్ వేశానని ఆవేదన వ్యక్తం చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు నన్ను ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదో రాతపూర్వకంగా ఇస్తే కోర్టుకు చెప్పుకుంటానని.. కానీ వాళ్లు చెప్పడం లేదన్నారు. తాను కర్మ సిద్ధాంతం నమ్ముతాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారని హెచ్చరిచారు.
మనోజ్ ఇంటికి వచ్చినస సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మంచు విష్ణు సినిమా టీంతో కలిసి యూపీ సీఎంను కలిసేందుకు వెళ్లారు. మోహన్ బాబు కూడా జల్ పల్లి నివాసంలో లేరు.