ఏపీలో రాజకీయ అలజడి రేపేందుకు జగన్ , వైసీపీ పార్టీ చేస్తున్న చచ్చు , పుచ్చు కుట్రలపై కేంద్ర హోంశాఖ దృష్టికి ఎంపీ లావు కృష్ణదేవరాయులు చేశారు. ఉద్దేశపూర్వకంగా జనాన్ని సమీకరించి హెలికాఫ్టర్లు చుట్టూ మూగేలా చేసుకుని.. రచ్చ చేస్తున్న వైనంతో పాటు పోలీస్ వ్యవస్థపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు.. అన్నీ కలిపి కేంద్రానికి ఎంపీ లావు లేఖ రాశారు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం హింస, కుల చిచ్చులతో నిండి ఉంటుందని.. ప్రజలు పూర్తిగా ఓడించినా ఆయన తన పార్టీ వారిని రెచ్చగొట్టి.. వారిని బలి చేసి..తాను రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ తన లేఖలో వివరించారు. ఇటీవల జగన్ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనలు, వాటి వెనుక పోలీసు దర్యాప్తులో తేలిన నిజాలను ఎంపీ ఆ లేఖకు జత చేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి అసహనంతో ఉన్నారు. ఆయన రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. కార్యకర్తల్ని కలవలేకపోతున్నారు. ఏదైనా శవం దొరికితే మాత్రం ప్లాన్డ్ గా జన సమీకరణ చేసి.. వెళ్తున్నారు. ఈ పిచ్చి తెలివితేటల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఊహించలేక ఆయన అదే ప్లాన్లు అమలు చేస్తున్నారు.